ప్రస్తుతం చైనా సహా అనేక దేశాల్లో కరోనా అల్లకల్లోలం చేస్తోంది. కరోనా ఒమిక్రాన్ సబ్ బేరియెంట్ బీఎఫ్7 అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో భారత్ సహా అనే దేశాలు అప్రమ్తమతవున్నాయి. మళ్లీ కరోనా ఆంక్షలు విధిస్తున్నాయి. ఐనప్పటికీ వేలాది మందితో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రం కొనసాగించడంపై విమర్శలు వస్తున్నాయి (ప్రతీకాత్మక చిత్రం)
ప్రస్తుతం ఈ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. భారత్ జోడో యాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి.. బీజేపీ ఓర్వలేకపోతోందని.. అందుకే కోవిడ్ పేరుచెప్పి.. అడ్డుకునేందుకు చూస్తోందని కాంగ్రెస్ మండిపడుతోంది. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ నేతలు ఎందుకు రోడ్‌షోలు చేస్తున్నారని ఎదురుదాడికి దిగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
అసోంలో సీఎం హిమంత బిశ్వ శర్మ భారీ ర్యాలీ నిర్వహించడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టుతోంది. మీ నేతలకు చెప్పి.. ఆ తర్వాత మా గురించి మాట్లాడాలని చురకలంటించింది. ఐతే ఇరు పార్టీల తీరుపై మాత్రం తీవ్ విమర్శలు వస్తున్నాయి. కరోనా వేళ.. ఎవరూ ర్యాలీ, సమావేశాలు ఏర్పాటు చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)