India Old Notes: రూ.200కే టన్ను కరెన్సీ నోట్లు.. మన పాత నోట్లను ఏం చేశారో తెలుసా?
India Old Notes: రూ.200కే టన్ను కరెన్సీ నోట్లు.. మన పాత నోట్లను ఏం చేశారో తెలుసా?
India Old Currency Notes:
మన దేశంలో పాత నోట్ల రద్దయ్యి ఐదేళ్లు గడిచాయి. 500, 1000 నోట్ల రద్దును అంత తేలిగ్గా ఎవరూ మరిచిపోరు. ప్రధాని మోదీ తీసుకున్న సంచలన నిర్ణయాల్లో అది కూడా ఒకటి. మరి ఆ నోట్లన్నీ ఇప్పుడు ఏమయ్యాయి. చిత్తు కాగితాలుగా చేసి తగులబెట్టారు? దేనికైనా వినియోగించారా?
పాత నోట్ల రద్దు తర్వాత వాటిని ప్రజల నుంచి బ్యాంకులు సేకరించాయి. ఆ తర్వాత ఆయా బ్యాంక్‌ల నుంచి ఆర్బీఐ తీసుకుంది. మరి ఆ రూ.500, 1000 నోట్లను ఆర్బీఐ ఏం చేసిందో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
రిజర్వ్ బ్యాంక్ రద్దయిన పాత నోట్లను కన్నూరు (కేరళ)లో ఉన్న వెస్టర్న్ ఇండియా ప్లైవుడ్ (WIP) కంపెనీకి విక్రయించింది. వాటిని ఆ కంపెనీ రీసైకిల్ చేసి హార్డ్ బోర్డులుగా మార్చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
తిరువనంతపురంలోని ఆర్బీఐ నుంచి పాత నోట్లను కొనుగోలు చేసిన వెస్టర్న్ ఇండియా ప్లైవుడ్ కంపెనీ.. వాటిని ముక్కలు ముక్కలుగా చేసింది. నీళ్లు పోసి అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించి గుజ్జుగా చేశారు. దానికి కలప గుజ్జు కూడా కలిపి ప్రాసెస్ చేసి హార్డ్ బోర్డులుగా మార్చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
అలా మొత్తం 800 టన్నుల కరెన్సీ నోట్లను కొనుగోలు చేసిన WIP వాటిని హార్డ్ బోర్డులుగా మార్చేసింది. ఆ హార్డ్ బోర్డులను సౌతాఫ్రికాకు ఎగుమతి చేశారు. అనంతరం 2019లో జరిగిన సౌతాఫ్రికా ఎన్నికల్లో ప్లకార్డులు, హోర్డింగ్‌ల కోసం వినియోగించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
మరి ఆర్బీఐ ఆ పాతనోట్లను ఎంత ధరకు విక్రయించిందో తెలుసా? నామమాత్రంగా అతి తక్కువ ధరకే WIPకి అమ్మేశారు. ఒక టన్ను పాత నోట్లను కేవలం రూ.200కు విక్రయించారు. అంటే 1,60,000కే 800 టన్నుల నోట్లను ఇచ్చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
భారత కరెన్సీ నాణ్యమైన కాగితంతో తయారు చేశారు. అందుకే వాటిని వృథా చేయకుండా హార్డ్ బోర్డుల తయారీకి WIP వినియోగించింది. అనంతరం సౌతాఫ్రికాకు ఎగుమతి చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
వెస్టర్న్ ఇండియా ఫ్లైవుడ్ కంపెనీ 1945లో ప్రారంభమయింది. కేరళలోని కన్నూరు జిల్లా వాలపట్టణం కేంద్రంగా నడుస్తోంది. ప్లై వుడ్‌తో పాటు బ్లాక్ బోర్డ్స్, ఫ్ల డోర్స్‌తో పాటు ఇతర కలప సంబంధిత వస్తువులు తయారు చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
ఇలా ఎన్నో ఏళ్ల పాటు ప్రజల పర్సులు, బీరువాలు, బ్యాంకుల్లో ఉన్న పాత రూ.500, 1000 నోట్లు కేరళలో గుజ్జులా మారి హార్డ్‌బోర్డులుగా తయారయ్యి.. చివరకు సౌతాఫ్రికా వెళ్లిపోయాయి. చివరకు ఆఫ్రికాలోవాటి కథ ముగిసింది. (ప్రతీకాత్మక చిత్రం)