Covid19: కరోనా వేరియంట్లలో ఇప్పటివరకూ ప్రపంచాన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టినది డెల్టా వేరియంట్ (delta variant). ఇది ప్రపంచంలోని 130కి పైగా దేశాల్లో వ్యాపించింది. తాజాగా చైనాలోనూ టెన్షన్ పెంచింది. ఇండియాలో ఇది సెకండ్ వేవ్‌కి కారణమై లక్షల మంది చనిపోవడానికి దారితీసింది. ఈ టెన్షన్ ఇలా ఉండగానే... మహారాష్ట్రలో డెల్టా ప్లస్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. మొత్తం 66 కేసులు రాగా... వాటిలో ఐదుగురు చనిపోయారు. మిగతావారు కోలుకున్నారు. అందువల్ల థర్డ్ వేవ్ రావడానికి ఈ డెల్టా ప్లస్ కారణం అవుతుందేమో అనే టెన్షన్ మొదలైంది. (image credit - NIAID)
డెల్టా ప్లస్ సోకిన 66 మందిలో 33 మంది... 19 నుంచి 45 ఏళ్లలోపు వారు. 18 మంది 46 నుంచి 60 ఏళ్ల మధ్యవారు. 8 మంది 60 ఏళ్లు దాటినవారు. ఈ 66 మందిలో 10 మంది రెండో డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు ఉన్నారు. అంటే... డెల్టా ప్లస్ అనేది ఎవరికైనా సోకగలుగుతోంది... వ్యాక్సిన్ వేయించుకున్నా సోకుతూనే ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. (image credit - NIAID)
డెల్టా వేరియంట్ తర్వాత... కొన్ని మార్పులతో వచ్చినదే డెల్టా ప్లస్ వేరియంట్. అంటే డెల్టా కంటే... డెల్టా ప్లస్ ప్రమాదకరమైనది అని అనుకోవచ్చు. కానీ... ఇప్పటివరకూ చూస్తే... డెల్టా మాత్రమే అత్యంత తీవ్రంగా ప్రపంచాన్ని చుట్టేస్తోంది. డెల్టా ప్లస్ అనేది ఇండియాతోపాటూ... మరో 10 దేశాల్లో మాత్రమే కనిపించింది. అది కూడా చాలా తక్కువగానే. ఇండియాలో మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌లోనే ఇది ఎక్కువగా కనిపించింది. మరో 9 రాష్ట్రాల్లో చాలా తక్కువగా కనిపించింది. (image credit - NIAID)
మామూలుగా అయితే... డెల్టా కంటే డెల్టా ప్లస్ ప్రమాదకరంగా ఉండాలి. కానీ చిత్రంగా... డెల్టా ప్లస్ అంత చురుగ్గా లేదు. డెల్టా మాత్రమే ఎక్కువగా చంపుతోంది. సైంటిస్టుల పరిశోధనలో ఇదే తేలింది. డెల్టా వేరియంట్ అనేది డబుల్ మ్యూటేషన్ వేరియంట్. ఇది L452R, P871R అనే రెండు మ్యూటేషన్లతో ఏర్పడింది. డెల్టా ప్లస్ అనేది... డెల్టా నుంచి K417N అనే మ్యూటేషన్ జరిగి ఏర్పడింది. డెల్టా వేరియంట్ ఏర్పడినప్పుడు దాని చుట్టూ ఉన్న కొవ్వు పదార్థం ముళ్ల సైజు మరింత పెరిగింది. డెల్టాప్లస్లో ఆ సైజు మరింత పెరిగింది కానీ... డెల్టా ప్లస్ జోరుగా లేదు. (image credit - NIAID)
వ్యాప్తి విషయంలో చూస్తే... డెల్టా వేరియంట్ చాలా బలంగా, వేగంగా ఉంది. అదే సమయంలో... డెల్టా ప్లస్ వేరియంట్‌కి అదనపు గుణం ఒకటి ఉంది. అదే ఇమ్యూన్ ఎస్కేప్ (immune escape). అంటే డెల్టా ప్లస్ అనేది... మన శరీరంలో యాంటీబాడీలను మోసం చేయగలదు. అందువల్ల యాంటీబాడీలు దాన్ని గుర్తించలేవు. కేంద్ర ప్రభుత్వం ప్రకారం... డెల్టా కంటే... డెల్టా ప్లస్ వేరియంట్... 60 శాతం ఎక్కువ వేగంగా ఊపిరి తిత్తుల్లోకి చొచ్చుకొని వెళ్లగలదు. ఇది చాలా బలమైనది. వేగంగా వ్యాప్తి చెందగలదు. అలాగే యాంటీబాడీలకు దొరకదు. ఇలా ఆలోచిస్తే డెల్టా ప్లస్ చాలా డేంజరస్ అని మనకు అర్థం అవుతుంది. (image credit - NIAID)
డెల్టా సోకినా, డెల్టా ప్లస్ సోకినా... లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటున్నాయి. దగ్గు, జ్వరం, విరేచనాలు, రొమ్ము దగ్గర నొప్పి, ఊపిరి ఆడకపోవడం, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు, కాళ్ల వేళ్లు, చేతుల వేళ్ల రంగు పోవడం వంటివి జరుగుతున్నాయి. వ్యాక్సిన్ల పరంగా చూస్తే... డెల్టా వేరియంట్‌ను వ్యాక్సిన్లు 70 శాతం వరకూ ఎదుర్కోగలుగుతున్నాయి. డెల్టా ప్లస్‌ని ఎలా ఎదుర్కోగలుగుతున్నాయి అనే దానిపై పరిశోధన జరగాల్సి ఉంది. (image credit - NIAID)
ఇదంతా చదివాక మనకు తెలిసేవి 2 కీలక పాయింట్లు. అవి 1. డెల్టా కంటే డెల్టా ప్లస్ చాలా డేంజరస్. 2. ప్రస్తుతం డెల్టా మాత్రమే జోరుగా ఉంది. డెల్టాను వ్యాక్సిన్లు అడ్డుకోగలుగుతున్నాయి కాబట్టి ఆ వైరస్ విషయంలో మనం పోరాడగలం. డెల్టా ప్లస్ విషయంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి... ఆ వేరియంట్ కేసులు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలపై ఉంటుంది. (image credit - NIAID)