75th Independence Day: 75వ స్వాతంత్ర్య దినోత్సవాలకు ఢిల్లీ ఎర్రకోట ముస్తాబైంది. నేటి ఉదయం 7-30కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరేస్తారు. ఆ తర్వాత జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. (image credit - twitter - ANI)
2/ 5
ఈ సందర్భంగా ప్రధాని మోదీ... దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఏడాది ఆగస్టు 15వరకూ జరిపే ఆజాదీ కా అమృత మహోత్సవం... ప్రజలకు కొత్త ఎనర్జీ తేవాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
3/ 5
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. ప్రధాని మోదీ ప్రత్యేక పథకాలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈసారి వేడుకలకు ఒలింపిక్స్ క్రీడాకారులు హాజరవుతుండటం విశేషం. (image credit - twitter - ANI)
4/ 5
స్వాతంత్ర్య దినోత్సవాలకు ఎర్రకోట దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎంట్రీ దగ్గర షిప్పింగ్ కంటైనర్‌ను ఏర్పాటుచేశారు. 350 సీసీ కెమెరాలతో పాటు 2 ప్రత్యేక పోలీసు కంట్రోల్ రూమ్‌లు ఉన్నాయి. (image credit - twitter - ANI)
5/ 5
ఎర్రకోట వద్ద 5 వేల మంది సిబ్బందితో భద్రత ఉంది. రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి కాబట్టి ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. (image credit - twitter - ANI)