Pics : ఢిల్లీలో పొగ ఎలా ఉందో ఈ ఫొటోలే చెబుతున్నాయి...

Delhi Pollusion : ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉందనీ, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారని మనకు తెలుసు. నిన్నటి నుంచీ సరి బేసి సంఖ్య విధానం మళ్లీ అమల్లోకి వచ్చింది. అది నవంబర్ 15 వరకూ కొనసాగనుంది. అందువల్ల నిన్న ఢిల్లీలో అన్నీ సరి సంఖ్య ఉన్న వాహనాలే (ద్విచక్ర వాహనాలకు మినహాయింపు ఉంది) రోడ్డెక్కాయి. ఈ రూల్ బ్రేక్ చేసిన వాళ్లకు రూ.4వేల ఫైన్ వేశారు అధికారులు. ఇక ఈ పొల్యూషన్‌కి మీరంటే మీరు కారణం అంటూ... కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర కేజ్రీవాల్ ప్రభుత్వం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. అటు ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల రైతులు మాత్రం పంట వ్యర్థాల్ని తగలబెట్టడం ఆపట్లేదు. ఫలితంగా రోజురోజుకూ వాయు కాలుష్యం కొనసాగుతోంది. అందుకు నిదర్శనం ఈ దృశ్యాలు.