Petrol Price: గుడ్‌న్యూస్.. అక్కడ భారీగా తగ్గిన పెట్రోల్‌ రేటు.. ఒకేసారి రూ.8 తగ్గింపు

Petrol Rate: పెట్రోల్, డీజిల్ ధరలు కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్నాయి. దీపావళికి ముందుకు కేంద్రం పన్నులు తగ్గించడంతో పాటు పలు రాష్ట్రాలు వ్యాట్ తగ్గించడంతో పెట్రోల్, డీజిల్ ధరలు దిగొచ్చాయి. అప్పటి నుంచీ ఇప్పటి వరకు పెరగలేదు. తగ్గలేదు. ఐతే తాజాగా ఢిల్లీ ప్రభుత్వం పెట్రోల్‌కు వ్యాట్‌ను భారీగా తగ్గించింది.