Omicron Tension: మెట్రో రైళ్లు, సిటీ బస్సుల్లో కొత్త రూల్స్.. మళ్లీ కఠిన ఆంక్షలు
Omicron Tension: మెట్రో రైళ్లు, సిటీ బస్సుల్లో కొత్త రూల్స్.. మళ్లీ కఠిన ఆంక్షలు
Omicron Tension: భారత్లో ఒమిక్రాన్ కేసులు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. అంతేకాదు కరోనా కేసులు ఒక్క సారిగా పెరుగుదల కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.
1/ 9
దేశ రాజధానిలో ఒమిక్రాన్ వేరియెంట్ టెన్షన్ నెలకొంది. బాధితుల సంఖ్య పెరగుతుండడంతో ప్రజా రవాణాపై ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సిటీ బస్సులు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతోనే నడుస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
ఢిల్లీ మెట్రోకు కూడా ఇదే వర్తిస్తుంది. 50శాతం మంది ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. సీటు విడిచి సీటులో కూర్చోవాల్సి ఉంటుంది. మెట్రో ఎంట్రెన్స్ గేట్లల్లోనూ మార్పులు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
మెట్రో రైళ్లు, సిటీ బస్సుల్లో వెళ్లే వారు ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. మాస్క్ లేకుంటే లోపలికి అనుమతించరు. భౌతిక దూరం పాటించాలి. ( ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
ఢిల్లీలో కొత్త కరోనా కేసుల్లో 50శాతం పెరుగుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ యెల్లో అలర్ట్ జారీ చేసింది. మళ్లీ ఆంక్షలను కఠినతరం చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
నిత్యావసర సరులకు అమ్మే దుకాణాలు, మెడికల్ షాపులు మినహా మిగతా షాపులన్నీ సరి, బేసి విధానంలో ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉండాలి. రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
పెళ్లిళ్లు, అంత్యక్రియలకు 20 కంటే ఎక్కువ మంది హాజరుకాకూడదు. రాజకీయ, మతపరమైన బహిరంగ సభలు, ర్యాలీలకు ఢిల్లీలో అనుమతి లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
వారంతపు సంతల్లో 50 శాతం మంది వెండర్స్కి మాత్రమే అనుమతి ఉంది. అందరూ భౌతిక దూరం పాటిస్తూ.. మాస్క్ ధరించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
రెస్టారెంట్లకు 50శాతం సీటింగ్ సామర్థ్యంతో ఉదయం 8 నుంచి రాత్రి10 వరకు అనమతి ఇచ్చారు. బార్లకు మాత్రం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 వరకు అనుమతి ఇచ్చారు. (ప్రతీకాత్మకచిత్రం)
9/ 9
ఢిల్లీలో నిన్న 496 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 172 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీల కంటే కొత్త కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఢిల్లీలో ఇప్పటి వరకు 238 ఒమిక్రాన్ కేసులు వచ్చాయి.