ఒడిశాలోని భువనేశ్వర్ రైల్వే స్టేషన్కి శుక్రవారం ఓ పీడకల చెప్పొచ్చు. ఫొణి తుఫానుతో గంటకు 245 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. పూరీ దాని చుట్టుపక్కల నగరాలు సర్వనాశనం అయిపోయాయి. భువనేశ్వర్ నగరం ఛిన్నాభిన్నమైంది. అక్కడి రైల్వే స్టేషన్ పూర్తిగా దెబ్బతింది. పైకప్పులు, గోడలు, హోర్డింగులు అన్నీ గాలికి కొట్టుకుపోయాయి. అంతా భయంకరంగా మారిపోయింది.