Coronavirus: ఇక కరోనా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదా? తాజా బులెటిన్ వివరాలు
Coronavirus: ఇక కరోనా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదా? తాజా బులెటిన్ వివరాలు
Coronavirus: 2020, 2021లో కరోనా వైరస్ అందరినీ వణికించింది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పూర్తిగా తగ్గింది. మరి గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు వచ్చాయి? ఎంత మరణించారో తెలుసుకుందాం.
India Covid 19: ఇండియాలో కోవిడ్ వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. దాంతో యాక్టివ్ కేసులు కూడా అంతగా లేవు. పండగ వేళ ఇది మంచి పరిణామం. కరోనా గురించి అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. (image credit - NIAID)
2/ 10
శనివారం దేశ్యాప్తంగా 5,664 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 4,555 మంది కరోనా నుంచి కోలుకోగా.. నిన్న 35 మరణాలు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 47,922గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
భారత్‌లో ఇప్పటి వరకు 4,45,34,188 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 4,39,57,929 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 5,28,337 మంది ప్రాణాలు కోల్పోయారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
శనివారం దేశవ్యాప్తంగా 2,89,228 మందికి పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా .. వారిలో 5,664 మందికి పాజిటివ్‌గా తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.96 శాతంగా నమోదయింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
ఒక్క కేరళ తప్ప.. దేశంలో ఎక్కడా కరోనా వ్యాప్తి ఎక్కువగా లేదు. అక్కడ నిన్న 2,211 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 631 మంది కోవిడ్ బారినపడ్డారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 10
15 రాష్ట్రాల్లో కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. 17 రాష్ట్రాల్లో తగ్గుతున్నాయి. మిజోరాంలో కరోనా పాజిటివిటీ రేటు 11.28 శాతంగా ఉంది. గోవాలో 9.51 శాతం, నాగాలాండ్‌లో 8.70 శాతం నమోదయింది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
తెలంగాణలో శనివారం 99 కొత్త కేసులు నమోదయ్యాయి. 106 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 55 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 42 మంది కోవిడ్ నుంచి బయటపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
మన దేశంలో గత ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 216.56 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 14.84 లక్షల మందికి టీకాలను వేశారు. మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 89,15,77,185కి చేరింది. (ప్రతీకాత్మక చిత్రం)