Coronavirus: భారత్‌లో కరోనావైరస్ పరిస్థితేంటి? తాజా బులెటిన్ హైలైట్స్ ఇవే
Coronavirus: భారత్‌లో కరోనావైరస్ పరిస్థితేంటి? తాజా బులెటిన్ హైలైట్స్ ఇవే
India Corona Updates: భారత్‌లో కరోనా వ్యాప్తి బాగా తగ్గింది. కొత్త కరోనా కేసులు సంఖ్య పడిపోవడంతో.. యాక్టివ్ కేసులు కూడా భారీగా తగ్గిపోయాయి. మరి గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు వచ్చాయి? ఎంత మంది మరణించారో ఇక్కడ తెలుసుకుందాం.
India Covid 19: ఇండియాలో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తోంది. కొత్త కేసుల సంఖ్య అంతకంతకూ పడిపోతోంది. యాక్టివ్ కేసులు 45 వేలకు దిగొచ్చింది. (image credit - NIAID)
2/ 10
మంగళవారం దేశ్యాప్తంగా 5,108 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 5,675 మంది కరోనా నుంచి కోలుకోగా.. నిన్న 31 మరణాలు నమోదయ్యాయి. ఇందులో 12 బ్యాక్లాగ్ మరణాలు కేరళ నుంచే ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
భారత్‌లో ఇప్పటి వరకు 4,45,10,057 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 4,39,36,092 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 5,28,216 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మన దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 45,749కి తగ్గాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
మంగళవారం దేశవ్యాప్తంగా 3,55,231 మందికి పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా .. వారిలో 5,108 మందికి పాజిటివ్‌గా తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.44 శాతంగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
కేరళలో 1,651, మహారాష్ట్రలో 730, కర్నాటకలో 344 మంది కరోనా బారినపడ్డారు. ఈ మూడు రాష్ట్రాల్లో తప్ప.. చాలా చోట్ల కరోనా కేసులు వంద కంటే తక్కువే వస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 10
మిజోరాంలో కరోనా పాజిటివిటీ రేటు 9.30 శాతంగా ఉంది. గోవాలో 7.64 శాతం, పుదుచ్చేరిలో 6శాతం నమోదయింది. దేశవ్యాప్తంగా 118 జిల్లాల్లో డైలీ పాజిటివిటీ రేటు 5శాతాని కంటే ఎక్కువగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
తెలంగాణలో మంగళవారం 129 కొత్త కేసులు నమోదయ్యాయి. 141 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 58 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 60 మంది కోవిడ్ నుంచి బయటపడ్డారు. ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
మన దేశంలో గత ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 215.67 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 19.25 లక్షల మందికి టీకాలను వేశారు. మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 89,02,99,090కి చేరింది. (ప్రతీకాత్మక చిత్రం)