ఇండియాలో కొత్తగా 8,635 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,07,66,245కి పెరిగింది. నిన్న జస్ట్ 94 మంది మాత్రమే చనిపోవడం గొప్ప విషయం. మొత్తం మరణాల సంఖ్య 1,54,486కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు 1.4 శాతమే ఉంది. అదే ప్రపంచ దేశాల్లో 2.16 శాతం ఉంది. అంటే ఆ దేశాల కంటే మన దేశంలో మరణాల రేటు చాలా తక్కువే ఉందనుకోవచ్చు. (image courtesy - NIAID)
ఇండియాలో నిన్న 13,423 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 1,04,48,406కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 97 శాతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,63,353 ఉన్నాయి. నిన్న టెస్టులు 6,59,422 జరిగాయి. అయినప్పటికీ కేసులు బాగా తగ్గాయంటే... దేశంలో నిజంగానే కరోనా తగ్గుతున్నట్లు లెక్క. మొత్తం టెస్టుల సంఖ్య 19కోట్ల 77లక్షలు దాటింది. (image courtesy - twitter)
విశ్లేషణ ప్రకారం చూస్తే... యాక్టివ్ కేసులు దేశంలో మరో 4.9వేలు తగ్గాయి. అలాగే... దాదాపు 8 నెలల తర్వాత అంటే... జూన్ 2, 2020లో ఎంత తక్కువ కేసులు వచ్చాయో... మళ్లీ ఇప్పుడు అంత తక్కువగా కొత్త కేసులు వచ్చాయి. అలాగే... కొత్త మరణాలు మే 12, 2020లో అంటే దాదాపు 9 నెలల కిందట ఇంత తక్కువగా వచ్చాయి. ఇప్పుడు ప్రపంచ యాక్టివ్ కేసుల్లో భారత్ 17కి పడిపోయింది. ఒకప్పుడు టాప్ 2లో ఉండేది. దేశంలో నిన్న కేరళలో అత్యధికంగా 3.5 వేల కొత్త కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో 1.9వేలు, తమిళనాడులో 502 కేసులు వచ్చాయి. 16 రాష్ట్రాలు లేదా కేంద్రపాలితాల్లో కొత్త మరణాలు జీరో వచ్చాయి. అలాగే 5 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలితాల్లో కొత్త కేసులు జీరో వచ్చాయి. చిత్రమేంటంటే... 2020లో చాలా తక్కువ కరోనా కేసులు వచ్చిన ఇండొనేసియాలో... ఇప్పుడు కరోనా విజృంభిస్తోంది. అక్కడ నిన్న కొత్త కేసులు 10,994 వచ్చాయి. కొత్త మరణాలు 279 వచ్చాయి. (image courtesy - twitter)
అమెరికాలో నిన్న 75,934 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసులు 2.68 కోట్లు దాటాయి. నిన్న 1,194 మంది చనిపోవడంతో... మొత్తం మరణాలు 4.53 లక్షలు దాటాయి. ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్లో కొనసాగుతోంది. ఇండియా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా తర్వాత స్పెయిన్ (25,867) రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత బ్రెజిల్, బ్రిటన్, రష్యా ఉన్నాయి. మొత్తం కరోనా మరణాల్లో అమెరికా టాప్లో ఉండగా... బ్రెజిల్, మెక్సికో, ఇండియా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రోజువారీ మరణాల్లో అమెరికా (1,194) టాప్లో ఉండగా... జర్మనీ (619), బ్రెజిల్ (565), మెక్సికో (462), ఫ్రాన్స్ (455) తర్వాతి పొజిషన్లలో ఉన్నాయి. (image credit - twitter - reuters)