ఇండియాలో నిన్న 11,831 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,08,38,194కి చేరాయి. నిన్న 84 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1,55,080కి చేరింది. మరణాల రేటు దేశంలో 1.4 శాతం ఉంది. నిన్న కొత్తగా 11,904 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 1,05,34,505కి చేరింది. రికవరీ రేటు దేశంలో 97.2 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,48,609గా ఉన్నాయి. నిన్న వీకెండ్ కావడంతో టెస్టులు తక్కువగా అంటే 5,32,236 మాత్రమే జరిగాయి. మొత్తం టెస్టుల సంఖ్య 20.19 కోట్లు దాటింది. (image credit - NIAID)
విశ్లేషణ చూస్తే... యాక్టివ్ కేసులు 157 తగ్గాయి. దేశంలోనే అత్యధికంగా కేరళలో నిన్న 6వేల కొత్త కేసులు వచ్చాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 2.7వేలు, కర్ణాటకలో 487 వచ్చాయి. ప్రస్తుతం దేశంలోని కొత్త కేసుల్లో 51 శాతం కేరళలోనే నమోదవ్వడం చిత్రమే. కేరళ, మహారాష్ట్ర కలిపితే మొత్తం 74 శాతం ఉన్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 30 మంది చనిపోగా... కేరళలో 19 మంది చనిపోయారు. కొత్త మరణాలు వరుసగా రెండో రోజు 100 కంటే తక్కువ వచ్చాయి. అలాగే కొత్త కేసులు వరుసగా పదో రోజు 15వేల కంటే తక్కువ వచ్చాయి. అమెరికాలో 3 నెలల తర్వాత మొదటిసారి కొత్త కేసులు లక్ష కంటే తక్కువ వచ్చాయి. (image credit - twitter)
ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్లో కొనసాగుతోంది. ఇండియా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా తర్వాత బ్రెజిల్ (26,845) రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్ ఉన్నాయి. మొత్తం కరోనా మరణాల్లో అమెరికా టాప్లో ఉండగా... బ్రెజిల్, మెక్సికో, ఇండియా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రోజువారీ మరణాల్లో అమెరికాను వెనక్కి నెట్టి మెక్సికో ముందుకొచ్చింది. నిన్న అక్కడ 1496 మంది చనిపోయారు. ఆ తర్వాత అమెరికా (1315), బ్రెజిల్ (492), రష్యా (432), బ్రిటన్ (373) తర్వాతి పొజిషన్లలో ఉన్నాయి. (image courtesy - twitter - reuters)