కరోనాకి వ్యాక్సిన్ రాగానే... ఇక ఆ వైరస్ పని అయిపోయినట్లే అనుకుంటున్నారు చాలా మంది. ఈ విషయంపై డాక్టర్లు క్లారిటీ ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా కరోనా సోకుతుందని తెలిపారు. కాకపోతే... వ్యాక్సిన్ వల్ల శరీరంలో యాంటీబాడీలు ఉంటాయి కాబట్టి... కరోనా సోకగానే... అవి వైరస్‌తో పోరాడి... చనిపోయే అవకాశాలను తగ్గిస్తాయని తెలిపారు. అలాగే... వ్యాక్సిన్ వేసుకున్న వారికి వైరస్ వృద్ధి చెందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పారు. అంతేగానీ... వైరస్ సోకదు అని మాత్రం అనుకోవద్దని తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకున్నవారు, వేసుకోనివారూ అందరూ మాస్కులు ధరించాలనీ, శానిటైజర్లు రాసుకోవాలనీ, సేఫ్ డిస్టాన్స్ పాటించాలని కోరుతున్నారు. (image credit - twitter - reuters)
ఇండియాలో కంటిన్యూగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా 18,599 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,12,29,398కి చేరింది. కొత్తగా 97 మంది మృతిచెందారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,57,853కి చేరింది. మరణాల రేటు 1.4 శాతంగా ఉంది. కొత్తగా 14,278 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,08,82,798 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ కేసుల రేటు 96.9 శాతం ఉంది. ప్రస్తుతం 1,88,747 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇండియాలో కొత్తగా 5,37,764 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 22,19,68,010కి చేరింది. (image credit - twitter - reuters)
తెలంగాణలో కొత్తగా 19,929 టెస్టులు చెయ్యగా... 111 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,00,011కి చేరింది. కొత్తగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 1,641కి చేరింది. కొత్తగా 189 మంది కోలుకున్నారు. మొత్తంగా 2,96,562 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 1,807 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వాటిలో 689 మంది హోమ్ క్వారంటైన్లో చికిత్స తీసుకుంటున్నారు. GHMCలో కొత్తగా 27 కరోనా కేసులు వచ్చాయి. మొత్తం టెస్టుల సంఖ్య 89,84,552కి చేరింది. (image credit - twitter - reuters)
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 25,907 టెస్టులు చేశారు. 74 కొత్త కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 8,90,766కి చేరింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 7,176కి చేరింది. కొత్తగా 61 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 8,82,581కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,009 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,42,62,086 టెస్టులు చేశారు. (image credit - twitter - reuters)
ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 2,83,940 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 11.77 కోట్లు దాటింది. కొత్తగా 6,231 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 26.11 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2.17 కోట్లకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం కరోనా సోకిన ప్రతి 100 మందిలో ఇద్దరు చనిపోతున్నారు. (image credit - twitter - reuters)
ప్రస్తుతం ప్రపంచ మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్‌లో కొనసాగుతోంది. ఇండియా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా మళ్లీ టాప్‌కి వెళ్లగా ఆ తర్వాత బ్రెజిల్, ఇండియా, ఇటలీ, టర్కీ ఉన్నాయి. మొత్తం కరోనా మరణాల్లో అమెరికా టాప్‌లో ఉండగా... బ్రెజిల్, మెక్సికో, ఇండియా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రోజువారీ మరణాల్లో బ్రెజిల్ (1114) టాప్‌లో ఉంది. ఆ తర్వాత అమెరికా (730), రష్యా (379), ఫ్రాన్స్ (359), ఇటలీ (318) తర్వాతి పొజిషన్లలో ఉన్నాయి. (image credit - twitter - reuters)