Coronavirus updates: మీకో సింపుల్ ప్రశ్న... కరోనా సోకితే మన శరీరంలో ఏయే అవయవాలు దెబ్బతింటాయి... అని అడిగితే... మీరేం చెబుతారు... ఊపిరితిత్తులు, గుండె అని చెబుతారు. ఎవరైనా అలాగే చెబుతారు. ఇక జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు ఇవన్నీ దాని లక్షణాలుగా చెప్పుకుంటాం. ఐతే... ఓ భారతీయ పరిశోధకుల బృందం... హైదరాబాద్ సహా... 5 నగరాల్లో... కరోనా వల్ల ఏయే శరీర భాగాలు దెబ్బతింటాయో పరిశోధన జరిపింది. ఏం తెలిసిందంటే... కరోనా వైరస్... మన శరీరంలోని ఏ పార్టునైనా నాశనం చేయగలదని తేలింది. పొట్టలోని చిన్న పేగులు, పెద్ద పేగులు, మూత్ర నాళాన్ని కూడా దెబ్బతీయగలదని చెప్పింది. ఈ పరిశోధన ఎలా చేశారంటే... శరీరంలోని వివిధ భాగాల కణజాలం కరోనా వల్ల ఎలా దెబ్బతింటోందో గమనించారు. అప్పుడు తెలిసింది... కిడ్నీలు, పునరుత్పత్తి భాగాలు, మెదడు (brain) కూడా నాశనం చేయగలదని. (Image credit - NIAID)
ఇదేమీ అల్లాటప్పా టీమ్ కాదు... ఇందులో అనాటమీ (శరీర నిర్మాణాన్ని పరిశీలించే విభాగం) డిపార్ట్మెంట్ వారు ఉన్నారు. అలాగే... ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), నాగపూర్, పాట్నా, దేవఘర్ యూనిట్లు, హైదరాబాద్‌లోని ESIC మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, ఛండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన పరిశోధకులు ఉన్నారు. వీరంతా కలిసి... 45 రీసెర్చ్ పబ్లికేషన్లను విశ్లేషించారు. తద్వారా ఈ షాకింగ్ విషయం తెలుసుకున్నారు. (Image credit - NIAID)
"ప్రధానంగా కరోనా వైరస్... శ్వాస అవయవాలు, వ్యాధి నిరోధక శక్తిపై దాడి చేస్తోంది. అలాగే మిగతా బాగాలైన గుండె, యురినరీ, పేగులు, పునరుత్పత్తి అవయవాలు, మెదడు, జుట్టు, చర్మం, గోళ్లు, ఎండోక్రిన్ గ్లాండ్స్ వంటి వాటిపైనా ప్రభావం చూపుతోంది. ముసలి వాళ్లు, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడేవారిపై కరోనా ఎక్కువ ప్రభావం చూపుతోంది" అని అధ్యయన వివరాల్ని జర్నల్ ఆఫ్ క్లినికల్ పాథోలజీలో ప్రచురించారు. (Image credit - NIAID)
వైరస్ లోడ్ తక్కువగా ఉన్నవారికి మాత్రం ఈ వైరస్... గొంతు నొప్పి, జ్వరం, అసౌకర్యం, శ్వాస సంబంధిత సమస్యలు తెస్తోందని గుర్తించారు. కొన్ని సందర్భాల్లో ఊపిరి ఆడక చనిపోతున్నారని గుర్తించారు. మహిళల్లో కంటే మగవాళ్లలో కరోనా వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. (Image credit - NIAID)