HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
COVID VACCINATION CORONAVIRUS ACTIVE CASES INCREASE IN 20 STATES OR UNION TERRITORIES IN INDIA LAST 24 HOURS NK
India Covid 19: ఇండియాలో కరోనా.. 20 రాష్ట్రాలు, కేంద్ర పాలితాల్లో పెరిగిన యాక్టివ్ కేసులు
Coronavirus updates: డౌట్ లేదు. వ్యాక్సిన్లు బాగానే పనిచేస్తున్నా... వాటి వల్ల కరోనా ఆగిపోతుంది అనుకోవద్దు. ఇండియాలో కరోనా మళ్లీ జోరందుకుంది. ఇక మనం జాగ్రత్త పడాల్సిందే.
News18 Telugu | February 28, 2021, 9:52 AM IST
1/ 5
India Covid 19: మొన్నటిదాకా కరోనా కేసులు పెరిగినా... తగ్గిపోతాయిలే అనే కాన్ఫిడెన్స్ అయినా ఉండేది... ఇప్పుడు అదీ లేకుండా పోతోంది. కారణం 10 రోజులుగా రోజూ కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. నిన్న మరీ ఎక్కువ పెరిగాయి. కొత్తగా 16,752 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1.11 కోట్లకు దగ్గర్లో ఉంది. నిన్న 113 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,57,051కి చేరింది. మరణాల రేటు దేశంలో 1.4 శాతం ఉంది. నిన్న 11,718 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 1.07 కోట్లు దాటింది. దేశంలో రికవరీ రేటు 97.1 శాతం ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,64,511 ఉన్నాయి. నిన్న దేశంలో 7,95,723 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 21.62 కోట్లు దాటింది. (image credit - NIAID)
2/ 5
నిన్న యాక్టివ్ కేసులు 4921 పెరిగాయి. రోజురోజుకూ అవి ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం 20 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా నిన్న ఒక్క రోజే మహారాష్ట్రలో 4924 యాక్టివ్ కేసులు పెరిగాయి. పంజాబ్లో 214, మధ్యప్రదేశ్లో 148, కర్ణాటకలో 137, గుజరాత్లో 122, హర్యానాలో 102, ఢిల్లీలో 76 చొప్పున యాక్టివ్ కేసులు పెరిగాయి. తెలంగాణలో 12 పెరగగా... ఆంధ్రప్రదేశ్లో 32 పెరిగాయి. అంటే... తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా జోరు ఇప్పుడిప్పుడే పెరుగుతోంది అనుకోవచ్చు. ఇప్పటికీ డాక్టర్లు మాస్క్ వాడాలనీ, శానిటైజర్ రాసుకోవాలనీ... సేఫ్ డిస్టాన్స్ పాటించాలని పదే పదే కోరుతున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారికి కూడా కరోనా సోకగలదు అని చెబుతున్నారు. తెలంగాణలో మార్చి 1 నుంచి 20 రకాల దీర్ఘ కాలిక వ్యాధులున్న 45 ఏళ్లు దాటిన వారికీ, 60 ఏళ్లు దాటిన వారికీ వ్యాక్సిన్ వేయనున్నారు. ప్రైవేట్ లో కూడా వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు. ప్రైవేట్ లో టీకా వేయించుకుంటే వ్యాక్సిన్ రేటు రూ.150కి తోడు అదనంగా రూ.100 సర్వీస్ ఛార్జి చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ఉచితంగానే వేస్తారు. (image credit - twitter)
3/ 5
ప్రపంచవ్యాప్తంగా నిన్న 3,77,585 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 11.43 కోట్లు దాటింది. నిన్న 7799 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 25.36 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2.19 కోట్లు ఉన్నాయి. ప్రస్తుతం కరోనా సోకిన ప్రతి 100 మందిలో ఇద్దరు చనిపోతున్నారు. అమెరికాలో నిన్న 62,279 కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2.92 కోట్లు దాటింది. నిన్న 1519 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 5.24 లక్షలు దాటింది. ప్రస్తుతం ప్రపంచ మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్లో కొనసాగుతోంది. ఇండియా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా తర్వాత బ్రెజిల్ (59,438) రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఫ్రాన్స్, ఇటలీ, ఇండియా ఉన్నాయి. మొత్తం కరోనా మరణాల్లో అమెరికా టాప్లో ఉండగా... బ్రెజిల్, మెక్సికో, ఇండియా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రోజువారీ మరణాల్లో అమెరికా (1519) టాప్లో ఉంది. ఆ తర్వాత బ్రెజిల్ (1275), మెక్సికో (782), రష్యా (439), పోలాండ్ (303) తర్వాతి పొజిషన్లలో ఉన్నాయి. (image credit - twitter)
4/ 5
ఇండియాలో కరోనా కేసుల వివరాలు
5/ 5
ప్రపంచ దేశాల్లో కరోనా కేసుల వివరాలు