దేశంలో కరోనా ఊహించిన దానికంటే ఎక్కువగా పెరుగుతోంది. ఎవరికి వాళ్లం అప్రమత్తంగా ఉండటం మంచిది. వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా సోకుతుంది. అందువల్ల వ్యాక్సిన్ వేసుకున్నాం కదా అని జాగ్రత్తలు పాటించకుండా ఉండొద్దు. ఏపీ సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలో... దక్షిణాఫ్రికా రకం కరోనా వైరస్ ఉందని తేలింది. అది చాలా వేగంగా వ్యాపించే రకం కాబట్టి ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విదేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ... మరింత బలంగా తయారవుతోంది. అందుకే కేసులు పెరుగుతున్నాయి. (image credit - reuters)
ఇండియాలో కొత్తగా 23,285 కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,13,08,856కి చేరింది. కొత్తగా 117 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,58,306కి చేరింది. కొత్తగా 15,157 మంది కరోనా నుంచి కోలుకోగా... మొత్తం రికవరీల సంఖ్య 1,09,53,303కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,97,237 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలోనే అతి ఎక్కువగా మహారాష్ట్రలో మార్చి 11న 14,317 కొత్త కేసులు నమోదయ్యాయి. అక్కడ కొత్తగా 57 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా 1.9లక్షల యాక్టివ్ కేసులుండగా.. వాటిలో లక్షకు పైగా మహారాష్ట్రలోనే ఉన్నాయి. అక్కడి నాగ్‌పూర్‌లో లాక్డౌన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. (image credit - reuters)
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 210 కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 8,91,388కి చేరింది. కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. మొత్తం మరణించిన వారి సంఖ్య 7,180కి చేరింది. కొత్తగా 140 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 8,82,981కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,227 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఏపీలో కొత్తగా 44,709 టెస్టులు చెయ్యగా.. ఇప్పటివరకు చేసినవి 1,44,48,650కి చేరాయి. (image credit - reuters)
ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 4,76,309 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 11.95 కోట్లు దాటింది. కొత్తగా 8,997 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 26.50 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2.06 కోట్లకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం కరోనా సోకిన ప్రతి 100 మందిలో ఇద్దరు చనిపోతున్నారు. (image credit - reuters)
ప్రస్తుతం ప్రపంచ మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్‌లో ఉంది. బ్రెజిల్, ఇండియా, రష్యా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ లిస్టులో ఇండియాని వెనక్కి నెట్టి బ్రెజిల్ సెకండ్ ప్లేస్‌కి వెళ్లింది. రోజువారీ కొత్త కేసుల్లో మళ్లీ బ్రెజిల్ టాప్‌కి వెళ్లింది. అక్కడ కొత్తగా 84,047 కేసులొచ్చాయి. బ్రెజిల్ తర్వాత అమెరికా, ఇండియా, ఇటలీ, ఫ్రాన్స్ ఉన్నాయి. మొత్తం కరోనా మరణాల్లో అమెరికా టాప్‌లో ఉండగా... బ్రెజిల్, మెక్సికో, ఇండియా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రోజువారీ మరణాల్లో బ్రెజిల్ (2,152) టాప్‌లో ఉంది. ఆ తర్వాత అమెరికా (1328), మెక్సికో (654), రష్యా (486), ఇటలీ (380) తర్వాతి పొజిషన్లలో ఉన్నాయి. (image credit - twitter - reuters)