Corona Updates : చైనాలో కరోనా విజృంభణకు కారణమైన BF.7 అనే వేరియంట్.. ఇండియాలో కూడా ప్రవేశించిన విషయం తెలియడంతో.. రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఇప్పుడే దేశవ్యాప్తంగా మళ్లీ కరోనాపై చర్చ జరుగుతోంది. ప్రజలు కూడా మళ్లీ మాస్కులు, శానిటైజర్లను బయటకు తీస్తున్నారు. కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు.. మళ్లీ కరోనా జాగ్రత్తలను చెబుతున్నాయి.
కరోనా లక్షణాలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రజలను కోరింది. ప్రభుత్వం కరోనా పరిశీలన కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ముంబైలో ఏర్పాట్లపై ఇవాళ రివ్యూ మీటింగ్ కూడా జరపబోతోంది. ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల్ని రూపొందిస్తోంది. ప్రభుత్వం ఇతర దేశాల నుంచి వచ్చేవారికి టెస్టులు తప్పనిసరి చేసింది.
2019లో కేరళలోని త్రిచూర్ జిల్లాలో తొలిసారిగా ముగ్గురు వ్యక్తులకు కరోనా సోకింది. ఇండియాలో కరోనా మొదటిసారి వచ్చింది అప్పుడే. ఆ ముగ్గురిలో ఒకరు.. చైనాలోని వుహాన్ యూనివర్శిటీలో చదివిన విద్యార్థి. అక్కడి నుంచి ఇండియాకి రావడంతో.. ఇండియాలో ఆ వైరస్ బయటపడింది. ఆ తర్వాత కరోనా ఇండియాలో ఎంతలా వ్యాపించిందో మనకు తెలుసు.