ఇండియాలో ఏప్రిల్ 2 తర్వాత మళ్లీ ఇప్పుడు అత్యంత తక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడు, మహారాష్ట్ర, కేరళలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. మిగతా రాష్ట్రాల్లో రోజూ 10 వేల కంటే తక్కువ కేసులే వస్తున్నాయి. కర్ణాటక 10వేల లిస్టులోంచి కిందకు వచ్చేసింది. (image credit - twitter)
ఢిల్లీలో ఇవాళ్టి నుంచి అన్‌లాక్ మొదలవుతోంది. నేటి నుంచి వారంలో అన్ని రోజులూ షాపులు తెరుస్తారు. సరిబేసి విధానం పాటించాల్సిన అవసరం లేదు. షాపులన్నీ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకూ తెరుస్తారు. ఇకపై 50 శాతం సీటింగ్‌తో రెస్టారెంట్లు తెరుస్తారు. టేక్ అవేలు, హోం డెలివరీలు ఎలాగూ ఉన్నాయి. హెయిర్ కటింగ్ సెలూన్లు తెరుస్తారు. ప్రభుత్వ ఆఫీసులు పూర్తి ఉద్యోగులతో పనిచేస్తాయి. ప్రైవేట్ ఆఫీసులు మాత్రం 50 శాతం ఉద్యోగులతోనే పనిచేస్తాయి. స్కూళ్లు, కాలేజీలు మాత్రం మూసే ఉంచారు. పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, ఆలయాలు వంటి వాటికి ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఢిల్లీ మెట్రో రైళ్లు, బస్సులు 50 శాతం ప్రయాణికులతో నడుస్తాయి. (image credit - twitter)
ప్రపంచంలో కరోనా వచ్చాక రెండుసార్లు ఫైన్ వేయించుకున్న అధ్యక్షుడిగా బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనారో నిలిచారు. ఆయన కరోనా రూల్స్ పాటించలేదంటూ... సావోపాలో గవర్నర్ జో డోరియా... 100 డాలర్ల ఫైన్ వేశారు. సావోపాలోలో జరిగిన ఓ బైక్ ర్యాలీ కార్యక్రమంలో బోల్సొనారో పాల్గొన్నారు. మాస్క్ పెట్టుకోలేదు. దాంతో రూల్స్ అతిక్రమించినట్లైంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న దేశంగా బ్రెజిల్ ఉంది. దీనిపై బోల్సోనారో ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇదొకటి చేరింది. (image credit - twitter)
Covid 19 Updates: ఇండియాలో కొత్తగా 80,834 కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,94,39,989కి చేరింది. కొత్తగా 3,303 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 3,70,384కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచదేశాల్లో ఇది 2.16 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 1,32,062 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,80,43,446కి చేరింది. రికవరీ రేటు కొద్దిగా పెరిగి 95.3కి చేరింది. ప్రస్తుతం భారత్‌లో 10,26,159 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 19,00,312 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 37 కోట్ల 80 లక్షల 63 వేల 173 టెస్టులు చేశారు. కొత్తగా 34,84,239 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 25 కోట్ల 31 లక్షల 95 వేల 048 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. (image credit - twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 1,280 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,03,369కి చేరాయి. కొత్తగా 2,261 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 5,78,748కి చేరింది. రికవరీ రేటు 95.91 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా 15 మంది మరణించారు. మొత్తం మరణాలు 3,484కి చేరాయి. మరణాల రేటు 0.57 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,137 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
AP Covid: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 1,02,876 టెస్టులు చెయ్యగా... కొత్తగా 6,770 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 18,09,844కి చేరింది. కొత్తగా 58 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 11,940కి చేరింది. కొత్తగా 12,492 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 17,12,267కి చేరింది. ప్రస్తుతం 85,637 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,04,50,982 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 2,93,850 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 17.67 కోట్లు దాటింది. కొత్తగా 8,437 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 38.18 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.212 కోట్లు ఉన్నాయి. అమెరికాలో కొత్తగా 5,220 కేసులు, 100 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో 36,998 కొత్త కేసులు... 1,118 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రోజువారీ ఎక్కువ కేసులు ఇండియా లేదా బ్రెజిల్లో వస్తుంటే... ఆ తర్వాత కొలంబియా, రష్యా, అర్జెంటినా ఉన్నాయి. రోజువారీ మరణాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉండగా... ఆ తర్వాత బ్రెజిల్, కొలంబియా, రష్యా, మెక్సికో ఉన్నాయి. (image credit - twitter - reuters)