పలు దేశాల్లో కోవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో భారత ప్రభుత్వం మంగళవారం కోవిడ్ గైడ్ లైన్స్ జారీ చేసింది. ఈ గైడ్ లైన్స్ లో భాగంగా..ఇవాళ్టి(డిసెంబర్ 21,2022)నుంచి విమనాశ్రయాలలో అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి శాంపిళ్లు తీసుకోవడాన్ని పునఃప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాల్లోనూ దీన్ని అప్పటికప్పుడు వైద్య సిబ్బందిని మోహరింపజేసింది.
ప్రస్తుతం విదేశీ ప్రయాణికుల నుంచి మాత్రమే ర్యాండమ్‌గా శాంపిళ్లను సేకరిస్తోన్నామని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్ తీవత్ర ఆధారంగా దీన్ని విస్తరిస్తామని పేర్కొంది. రోజుకు 100 నుండి 600 పరీక్షలను పెంచుతామని ఆరోగ్య కార్యదర్శి యశ్పాల్ గార్గ్ తెలిపారు. ప్రజలు త్వరగా టీకాలు వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇంతలో జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, చైనా,అమెరికాలో కరోనా కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడంతో వైరస్ యొక్క అభివృద్ధి చెందుతున్న స్వభావాన్ని పర్యవేక్షించాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. సోకిన నమూనాల మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని సూచించింది.(ప్రతీకాత్మక చిత్రం)