ఇండియాలో మహారాష్ట్ర సహా చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గిపోతుంటే... కేరళలో మాత్రం అవి ఎక్కువగానే నమోదవుతున్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో సగం కేరళలోనే వస్తున్నాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం మైక్రో కంటైన్మెంట్ జరపాలని ఆదేశించింది. అక్కడ వ్యాక్సిన్ వేసుకున్నవారిలో 40 వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియా త్వరలో కేరళ పర్యటనకు రానున్నారు. శనివారం దేశంలోనే ఎక్కువగా కేరళలో 19.45వేల కొత్త కేసులు రాగా... ఆ తర్వాత మహారాష్ట్రలో 5.79వేల కోట్లు, తమిళనాడులో 1.92వేల కోట్లు వచ్చాయి. ప్రస్తుతం 12 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. పాజిటివిటీ రేటు కేరళలో 14.35 శాతం, మణిపూర్లో 12.88 శాతం, సిక్కింలో 10.88 శాతం ఉంది. (image credit - twitter - reuters)
AP Covid: ఏపీలో కొత్తగా 65,500 టెస్టులు చెయ్యగా... కొత్తగా 1,506 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 19,93,697కి చేరింది. కొత్తగా 16 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 13,647కి చేరింది. కొత్తగా 1,835 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 19,62,185కి చేరింది. ప్రస్తుతం 17,865 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,56,61,449 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 245 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,52,380కి చేరాయి. కొత్తగా 582 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 6,41,270కి చేరింది. రికవరీ రేటు 98.29 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా ఒకరు మరణించారు. మొత్తం మరణాలు 3,842కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,268 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో నిన్న కొత్తగా 4,66,490 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 20.79 కోట్లు దాటింది. కొత్తగా 8,043 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 43.74 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.71 కోట్లు ఉన్నాయి. అమెరికాలో కొత్తగా 30,883 కేసులు, 122 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో నిన్న 13,957 కొత్త కేసులు, 385 మరణాలు సంభవించాయి. (image credit - twitter - reuters)