Coronavirus: పండగల వేళ నిజంగా శుభ పరిణామం.. కరోనా మహమ్మారి ఖేల్ ఖతమ్.. భారీగా తగ్గిన కేసులు
Coronavirus: పండగల వేళ నిజంగా శుభ పరిణామం.. కరోనా మహమ్మారి ఖేల్ ఖతమ్.. భారీగా తగ్గిన కేసులు
Coronavirus Updates: సాధారణంగా పండగల సమయంలో జనాలు ఎక్కువగా కలవడం వల్ల కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కరోనా కేసులు రోజు రోజుకూ తగ్గిపోతున్నాయి. ఇది నిజంగా శుభ పరిణామం.
India Covid 19: పండగల వేళ కరోనా వ్యాప్తి భారీగా తగ్గిపోవడం శుభపరిణామం. కొత్త కేసులతో పాటు యాక్టివ్ కేసులు కూడా పడిపోయాయి. రోజూవారీ కేసులు 7వేలకు అటూ ఇటూగా నమోదవుతున్నాయి. (image credit - NIAID)
2/ 10
మన దేశంలో శనివారం 6,809 కొత్త కేసులు నమోదయ్యాయి. 8,414 మంది కోవిడ్ నుంచి కోలుకోగా... 16 మరణాలు నమోదయ్యాయి. ఇందులో 5 బ్యాక్లాగ్ మరణాలున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
తాజా కేసులతో కలిపి.. ఇప్పటి వరకు 4,44,56,535 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 4,38,73,430 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 5,27,991 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజూవారీ కేసులు తగ్గడంతో.. యాక్టివ్ కేసులు 55,114కి తగ్గాయి. ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
శనివారం 3,20,820 మందికి పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 6,809 మందికి పాజిటివ్‌గా తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.12 శాతానికి చేరింది. నిన్న 1.98శాతంగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
ప్రస్తుతం కేరళ, మహారాష్ట్రలో కేసుల తీవ్ర కాస్త ఎక్కువగా ఉంది. కేరళలో 1416, మహారాష్ట్రలో 1272, కర్నాటకలో 941 మంది కరోనా బారినపడ్డారు. మిగతా రాష్ట్రాల్లో మాత్రం తక్కువ సంఖ్యలోనే కేసులు వస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 10
ప్రస్తుతం మిజోరాంలో 16.94 శాతం కరోనా పాజిటివిటీ ఉంది. సిక్కింలో 5.73శాతం, పుదుచ్చేరిలో 5.40శాతంగా నమోదయింది. 146 జిల్లాల్లో డైలీ పాజిటివిటీ రేటు 5శాతాని కంటే ఎక్కువగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
తెలంగాణలో శనివారం 151 కొత్త కేసులు నమోదయ్యాయి. 255 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీ విషయానికొస్తే.. 71 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 197 మంది కోలుకున్నారు. ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
మన దేశంలో గత ఏడాది ప్రారంభం నుంచి 213.29 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 19.35 లక్షల మందికి టీకాలను వేశారు. మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 88,71,51,961కి చేరింది. (ప్రతీకాత్మక చిత్రం)