ఇండియాలో కొత్తగా 38,091 మంది రికవరీ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 3,21,38,092కి చేరింది. రికవరీ రేటు 97.4 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్లో 4,10,048 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 17,47,476 టెస్టులు చేశారు. భారత్లో ఇప్పటివరకు 53 కోట్ల 00 లక్షల 58 వేల 218 టెస్టులు చేశారు. కొత్తగా 71,61,760 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 68 కోట్ల 46 లక్షల 69 వేల 521 వ్యాక్సిన్లు వేశారు. (image credit - twitter)
ఇండియాలో యాక్టివ్ కేసులు 4,367 పెరిగాయి. ఇవి వరుసగా ఐదో రోజు పెరిగాయి. కొత్త కేసులు వరుసగా ఐదో రోజు 40వేల కంటే ఎక్కువ వచ్చాయి. దేశంలోనే ఎక్కువగా కేరళలో నిన్న కొత్త కేసులు 29,682 వేలు వచ్చాయి. ఆ తర్వాత ఎక్కువగా మహారాష్ట్రలో 4,130 కేసులు, తమిళనాడులో 1575 కొత్త కేసులు వచ్చాయి. దేశంలోని యాక్టివ్ కేసుల్లో 2.5 లక్షలతో 61 శాతం కేరళ కలిగివుంది. నిన్న దేశంలోనే ఎక్కువగా కేరళలో 142 మంది కరోనాతో చనిపోగా... ఆ తర్వాత మహారాష్ట్రలో 64, తమిళనాడులో 20 మంది చనిపోయారు. మరణాలు 159 రోజుల తర్వాత తక్కువగా నమోదయ్యాయి. అవి వరుసగా మూడో రోజు 400 కంటే తక్కువ వచ్చాయి. ప్రస్తుతం 9 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలలో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. టెస్టుల పాజిటివిటీ రేటు వరుసగా ఆరో రోజు 3 శాతం కంటే తక్కువ ఉన్నాయి. పాటిజివిటీ రేటు దేశంలోనే ఎక్కువగా కేరళలో 18.46 శాతం, మిజోరంలో 10.76 శాతం, మణిపూర్లో 8.87 శాతం ఉంది. (image credit - twitter - reuters)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 306 పాజిటివ్ కేసులొచ్చాయి. ముగ్గురు చనిపోయారు. తాజాగా 366 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,59,313కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 3,883కి చేరింది. గత 24 గంటల్లో తెలంగాణ ప్రభుత్వం 69,422 టెస్టులు చేసింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 5,673గా ఉంది. (image credit - twitter - reuters)
AP Covid: ఏపీలో కొత్తగా 63,717 టెస్టులు చెయ్యగా... కొత్తగా 1,502 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 20,19,702కి చేరింది. కొత్తగా 16 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 13,903కి చేరింది. కొత్తగా 1,525 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 19,90,916కి చేరింది. ప్రస్తుతం 14,883 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,68,73,491 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 4,73,141 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 22.10 కోట్లు దాటింది. కొత్తగా 7,617 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 45.73 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.89 కోట్లు ఉన్నాయి. అమెరికాలో కొత్తగా 58,486 కేసులు, 569 మరణాలు వచ్చాయి. ఆ తర్వాత ఇండియాలో ఎక్కువ కేసులు రాగా... మూడోస్థానంలో బ్రిటన్ (37,578) ఉంది. నాలుగో స్థానంలో ఉన్న బ్రెజిల్లో నిన్న 21,804 కొత్త కేసులు, 609 మరణాలు సంభవించాయి. ఆ తర్వాత ఫిలిప్పీన్స్లో 20,741 కొత్త కేసులు వచ్చాయి. (image credit - twitter - reuters)