ఇండియాలో కరోనా యాక్టివ్ కేసులు 2.45 వేలు పెరిగాయి. కొత్త కేసులు వరుసగా రెండో రోజు 40వేల కంటే తక్కువ వచ్చాయి. నిన్న దేశంలోనే అత్యధికంగా కేరళలో 20.45 వేల కేసులు రాగా... ఆ తర్వాత మహారాష్ట్రలో 6.69వేలు, తమిళనాడులో 1,933 వేల కొత్త కేసులు వచ్చాయి. నిన్న దేశంలోనే ఎక్కువగా మహారాష్ట్రలో 158 మంది చనిపోగా... ఆ తర్వాత కేరళలో 114 మంది, ఒడిశాలో 60 మంది చనిపోయారు. ప్రస్తుతం 11 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. కొత్త కేసులు ఈవారం... గత వారం మధ్య తేడా చూస్తే... 7 శాతం తగ్గాయి. ప్రపంచ దేశాల్లో మాత్రం 3 శాతం పెరిగాయి. గత 18 రోజుల్లో నిన్ననే అత్యధికంగా వ్యాక్సిన్లు వేశారు. ప్రస్తుతం ఇండియాలో టెస్టుల పాజిటివిటీ రేటు 1.73 శాతం ఉంది. ఐతే... కేరళలో అది 14.73 శాతం ఉండగా... మణిపూర్లో 14.48 శాతం, సిక్కింలో 11.21 శాతం ఉంది. (image credit - twitter - reuters)
AP Covid: ఏపీలో కొత్తగా 73,341 టెస్టులు చెయ్యగా... కొత్తగా 1,746 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 19,90,656కి చేరింది. కొత్తగా 20 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 13,615కి చేరింది. కొత్తగా 1,648 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 19,58,275కి చేరింది. ప్రస్తుతం 18,766 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,55,26,861 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 427 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,51,715కి చేరాయి. కొత్తగా 609 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 6,40,065కి చేరింది. రికవరీ రేటు 98.21 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా ఇద్దరు మరణించారు. మొత్తం మరణాలు 3,838కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,812 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో నిన్న కొత్తగా 6,76,917 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 20.68 కోట్లు దాటింది. కొత్తగా 9,906 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 43.57 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.69 కోట్లు ఉన్నాయి. ఇవి మెల్లగా పెరుగుతున్నాయి. అమెరికాలో కొత్తగా 1,25,291 కేసులు, 724 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో నిన్న 33,933 కొత్త కేసులు, 874 మరణాలు సంభవించాయి. (image credit - twitter - reuters)