ఇండియాలో కొత్తగా 39,486 మంది రికవరీ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 3,17,20,112కి చేరింది. రికవరీ రేటు 97.7 శాతానికి పెరిగింది. ప్రస్తుతం భారత్లో 3,19,551 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 16,47,526 టెస్టులు చేశారు. భారత్లో ఇప్పటివరకు 50 కోట్ల 93 లక్షల 91 వేల 792 టెస్టులు చేశారు. కొత్తగా 63,85,298 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 58 కోట్ల 89 లక్షల 97 వేల 805 వ్యాక్సిన్లు వేశారు. (image credit - twitter - reuters)
ఇండియాలో యాక్టివ్ కేసులు 14.4 వేలు తగ్గాయి. అవి 156 రోజుల కనిష్టానికి తగ్గాయి. కొత్త మరణాలు 146 రోజుల్లో అతి తక్కువ నమోదయ్యాయి. అలాగే కొత్త కేసులు వరుసగా రెండో రోజు 30వేల కంటే తక్కువ వచ్చాయి. అలాగే... మరణాలు వరుసగా రెండో రోజు 400 కంటే తక్కువ వచ్చాయి. నిన్న దేశంలోనే ఎక్కువగా కేరళలో కొత్త కేసులు 13.4వేలు వచ్చాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో కొత్త కేసులు 3.6వేలు రాగా... తమిళనాడులో 1.6వేలు వచ్చాయి. నిన్న దేశంలోనే ఎక్కువగా మహారాష్ట్రలో కొత్త మరణాలు 105 రాగా... ఆ తర్వాత కేరళలో 90, ఒడిశాలో 68 వచ్చాయి. ప్రస్తుతం 6 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. గత వారం కొత్త కేసుల్ని అంతకు ముందు వారం కొత్త కేసులతో పోల్చితే... అవి 17 శాతం తగ్గాయి. ప్రపంచ దేశాల్లో 0.5 శాతం తగ్గాయి. టెస్టుల పాజిటివిటీ రేటు 189 రోజుల కనిస్టానికి తగ్గింది. అది వరుసగా 59వ రోజున 3 శాతం కంటే తక్కువగా వచ్చింది. ఐతే... దేశంలోనే ఎక్కువగా కేరళలో టెస్టుల పాజిటివిటీ రేటు 16.27 శాతం ఉండగా... సిక్కింలో 10.94 శాతం, మణిపూర్లో 10.77 శాతం ఉంది. (image credit - twitter - reuters)
AP Covid: ఏపీలో కొత్తగా 47,972 టెస్టులు చెయ్యగా... కొత్తగా 1,002 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 20,03,342కి చేరింది. కొత్తగా 12 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 13,735కి చేరింది. కొత్తగా 1,508 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 19,75,448కి చేరింది. ప్రస్తుతం 14,159 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,61,39,934 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 354 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,55,343కి చేరాయి. కొత్తగా 427 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 6,45,174కి చేరింది. రికవరీ రేటు 98.44 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా ముగ్గురు మరణించారు. మొత్తం మరణాలు 3,861కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,308 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 4,70,574 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 21.31 కోట్లు దాటింది. కొత్తగా 7,089 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 44.51 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.79 కోట్లు ఉన్నాయి. అమెరికాలో కొత్తగా 78,736 కేసులు, 346 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో నిన్న 13,103 కొత్త కేసులు, 274 మరణాలు సంభవించాయి. (image credit - twitter - reuters)
నిన్న రోజువారీ ఎక్కువ కేసులు అమెరికాలో వచ్చాయి. ఆ తర్వాత ఇరాన్ (38,657)లో వచ్చాయి. ఆ తర్వాత బ్రిటన్ (31,914), జపాన్ (22,285), రష్యా (19,454) వచ్చాయి. నిన్న రోజువారీ మరణాలు ఇండొనేసియా (842)లో ఎక్కువగా రాగా... ఆ తర్వాత రష్యా (776), ఇరాన్ (610), వియత్నాం (389), అమెరికాలో వచ్చాయి. (image credit - twitter - reuters)