Coronavirus Bulletin: ఇండియా కరోనా కేసుల అప్డేట్స్.. తాజా బులెటిన్ వివరాలు ఇవే
Coronavirus Bulletin: ఇండియా కరోనా కేసుల అప్డేట్స్.. తాజా బులెటిన్ వివరాలు ఇవే
India Coronavirus Updates: ఇండియాలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు కూడా తక్కువగానే వస్తున్నాయి. మరి గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు వచ్చాయి? ఎంత మరణించారో ఇక్కడ తెలుసుకుందాం.
India Covid 19: మన దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసుల 10వేల లోపే నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా లక్ష లోపే ఉంది. (image credit - NIAID)
2/ 11
మంగళవారం దేశవ్యాప్తంగా 9,531 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ నుంచి మరో 11,726 మంది కోలుకున్నారు. కొత్తగా 36 మరణాలు నమోదయ్యాయి. ఢిల్లీలో 9 మంది, మహారాష్ట్రలో ఏడుగురు చనిపోయారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 11
మన దేశంలో ఇప్పటి వరకు 4,43,48,960 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 4,37,23,944 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 5,27,368 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 97,648గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 11
నిన్న దేశవ్యాప్తంగా 2,29,546 మందికి పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో 9,531కి పాజిటివ్ వచ్చింది. నిన్నటితో పోల్చితే కరోనా పాజిటివిటీ రేటు పెరిగింది. నిన్న 2.19 శాతం ఉండగా.. ఇవాళ్టి బులెటిన్లో అది 2.62 శాతానికి పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 11
మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, ఢిల్లీలోనే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో 1832,కేరళలో 1089, కర్నాటకలో 720, ఢిల్లీలో 942 మంది కరోనావైరస్ బారినపడ్డారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 11
దేశంలోనే అత్యధికంగా మిజోరాంలో కరోనా పాజిటివిటీ రేటు 17.70శాతంగా ఉంది. కేరళలో 12.5శాతం, గోవాలో 10శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 211 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 5శాతం కంటే ఎక్కువగా ఉండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 11
ప్రస్తుతం మన దేశంలో 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా యాక్టివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 11
తెలంగాణలో మంగళవారం 252 కొత్త కేసులు నమోదయ్యాయి. 291 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీ విషయానికొస్తే.. అక్కడ 142 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో 160 మంది కోలుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 11
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 210.02 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 35.33 లక్షల మందికి టీకాలను వేశారు. మొత్తం పరీక్షల సంఖ్య 88,27,25,509కి చేరింది. (ప్రతీకాత్మక చిత్రం)