ఇండియాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కేరళలో పరిస్థితి బాగోలేదు. అక్కడ తాజాగా దేశంలోనే అతి ఎక్కువగా 22వేలకు పైగా కేసులు వచ్చాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 9వేలకు పైగా వచ్చాయి. ఇది థర్డ్ వేవే అని చాలా మంది అంటున్నారు. సమస్యేంటంటే... రికవరీ కేసుల కంటే కొత్త కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. 11 రోజులుగా పాజిటివిటీ రేటు 11 శాతం కంటే ఎక్కువగా ఉంది. సో, మనం జాగ్రత్తగా ఉండాల్సిందే అని ఈ లెక్కలు చెబుతున్నాయి. (image credit - twitter - reuters)
ఇండియాలో మరో కొత్త కరోనా వేరియంట్ బయటపడింది. అది కూడా ఆల్ఫా, డెల్టా లాంటిదే. పేరు ఈటా. దీన్ని మరో రకంగా B.1.525 అని పిలుస్తున్నారు. ప్రస్తుతం డెల్టా వేరియంట్ 135కి పైగా దేశాల్లో ఉంది. ఐతే... దుబాయ్ నుంచి భారత్ వచ్చిన ఓ వ్యక్తిలో ఈటా వేరియంట్‌ని గుర్తించారు. అతని ద్వారా అది ఇంకా ఎవరికైనా చేరిందా అన్నది గమనిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కేసుల్లో 77 శాతం డెల్టావే. ఈటా కొత్తదేమీ కాదు. మార్చి 5 నాటికి అది 23 దేశాలకు విస్తరించింది. దీన్ని 2020 డిసెంబర్లో బ్రిటన్, నైజీరియాలో చూశారు. (image credit - twitter - reuters)
AP Covid: ఏపీలో కొత్తగా 81,505 టెస్టులు చెయ్యగా... కొత్తగా 2,209 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 19,78,350కి చేరింది. కొత్తగా 22 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 13,490కి చేరింది. కొత్తగా 1,896 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 19,44,267కి చేరింది. ప్రస్తుతం 20,593 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,50,27,770 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 577 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,48,388కి చేరాయి. కొత్తగా 645 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 6,35,895కి చేరింది. రికవరీ రేటు 98.07 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా ఇద్దరు మరణించారు. మొత్తం మరణాలు 3,819కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,674 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచ దేశాల్లో నిన్న కొత్తగా 6,79,479 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 20.23 కోట్లు దాటింది. కొత్తగా 10,025 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 42.89 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.61 కోట్లు ఉన్నాయి. ఇవి మెల్లగా పెరుగుతున్నాయి. అమెరికాలో కొత్తగా 1,21,449 కేసులు, 736 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో నిన్న 42,159 కొత్త కేసులు, 1,006 మరణాలు సంభవించాయి. (image credit - twitter - reuters)
నిన్న రోజువారీ ఎక్కువ కేసులు అమెరికాలో వచ్చాయి. లక్షకు పైగా వస్తుండటం తీవ్ర ఆందోళనకర అంశం. ఆ తర్వాత బ్రెజిల్, ఇండొనేసియా (39,532), ఇండియా, ఇరాన్ (34,913)లో వచ్చాయి. నిన్న రోజువారీ మరణాలు ఇండొనేసియా (1,635)లో ఎక్కువగా రాగా... ఆ తర్వాత బ్రెజిల్, రష్యా (792), అమెరికా, మెక్సికో (21,569)లో వచ్చాయి. (image credit - twitter - reuters)