ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్లో కొనసాగుతోంది. ఇండియా, బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా తర్వాత బ్రిటన్ని వెనక్కి నెట్టి మళ్లీ బ్రెజిల్ (55,799) రెండో స్థానంలోకి వచ్చింది. ఆ తర్వాత బ్రిటన్ 36,804 కేసులతో మూడో స్థానంలో ఉంది. మొన్నటి కంటే నిన్న బ్రిటన్లో అదనంగా మరో 3వేల దాకా కొత్త కేసులు పెరిగాయి. మొన్న 33,363 వచ్చాయి. ఇక నాలుగో స్థానంలో రష్యా (28,776), ఐదోస్థానంలో ఇండియా ఉన్నాయి. మొత్తం కరోనా మరణాల్లో అమెరికా టాప్లో ఉండగా... బ్రెజిల్ (1,88,285), ఇండియా, మెక్సికో (1,18,598), ఇటలీ (69,842), బ్రిటన్ (68,307) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రోజువారీ మరణాల్లో అమెరికా (2,830) టాప్లో ఉండగా... బ్రెజిల్ (963), జర్మనీ (944), బ్రిటన్ (691) (మొన్న 215), ఇటలీ (628) తర్వాతి పొజిషన్లలో ఉన్నాయి. (image credit - twitter - reuters)