ప్రస్తుతం మొత్తం కేసుల్లో అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య కేసుల తేడా... 8 లక్షలే ఉంది. రోజువారీ కొత్త కేసులలో ఇండియా మొదటి స్థానంలో కొనసాగుతుంటే... అమెరికా, ఫ్రాన్స్ (16,101), రష్యా (13,634), బ్రిటన్ (12,872) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తం మరణాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడోస్థానంలో కొనసాగుతోంది. రోజువారీ మరణాల్లో భారత్ మొదటిస్థానంలో ఉండగా... అమెరికా, అర్జెంటినా (287 మరణాలు) బ్రెజిల్, ఇరాన్ (251 మరణాలు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. (credit - twitter - reuters)