ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్లో కొనసాగుతోంది. ఇండియా, బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఫ్రాన్స్ (21,96,119)ని వెనక్కి నెట్టి రష్యా (22,15,533 కొత్త కేసులు) ముందుకెళ్లింది. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా తర్వాత ఇండియా, బ్రెజిల్, టర్కీ, రష్యా, ఇటలీ ఉన్నాయి. మొత్తం మరణాల్లో అమెరికా టాప్లో ఉండగా... బ్రెజిల్, ఇండియా, మెక్సికో, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రోజువారీ మరణాల్లో అమెరికా (1381) టాప్లో ఉండగా... ఇటలీ (827), మెక్సికో (645), ఫ్రాన్స్ (581), పోలాండ్ (579) తర్వాతి పొజిషన్లలో ఉన్నాయి. (credit - twitter - reuters)