ఇండియాలో నిన్న కొత్తగా 38,617 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 89,12,907కి చేరింది. నిన్న కరోనా వల్ల 474 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1,30,993కి చేరింది. ప్రస్తుతం ఇండియాలో మరణాల రేటు 1.5 శాతం ఉంది. ప్రపంచ దేశాల్లో అది 2.4 శాతం ఉంది. ఇండియాలో నిన్న కరోనా నుంచి 44,739 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 83,35,109కి చేరింది. దేశంలో రికవరీ రేటు 93.5 శాతానికి చేరింది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసులు 4,46,805 ఉన్నాయి. ఇండియాలో నిన్న 9,37,993 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 12కోట్ల 74లక్షల 80వేల 186కి చేరింది. (credit - NIAID)