ఇండియాలో నిన్న కొత్తగా 18,177 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,03,23,965కి చేరింది. నిన్న 217 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,49,435కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.4 శాతం ఉండగా... ప్రపంచంలో అది 2.17 శాతం ఉంది. దేశంలో నిన్న 20,923 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 99,27,310కి చేరింది. దేశంలో రికవరీ రేటు 96.2 శాతానికి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,47,220 ఉన్నాయి. నిన్న దేశంలో 9,58,125 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 17,48,99,783కి చేరింది. (image credit - twitter - reuters)