ఇండియాలో నిన్న కొత్తగా 45,209 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 90,95,806కి చేరింది. అలాగే... నిన్న కరోనాతో 501 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,33,227కి చేరింది. ప్రస్తుతం ఇండియాలో మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. ఇండియాలో నిన్న కరోనా నుంచి 43,493 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 85,21,617కి చేరింది. ఇండియాలో రికవరీ రేటు 93.7 శాతంగా ఉంది. ప్రస్తుతం ఇండియాలో 4,40,962 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న దేశంలో 10,75,326 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 13,17,33,134కి చేరింది.