HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
CORONAVIRUS UPDATES INDIA RECORDS 36595 NEW COVID 19 CASES AND 540 NEW DEATHS IN 24 HOURS NK
India Covid 19: ఇండియాలో మరింత తగ్గిన కరోనా జోరు... మరణాలు మాత్రం ఎక్కువే
Coronavirus updates: ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో కరోనా వైరస్ చాలా తీవ్రంగా ఉంది. ఇండియాలో అప్రమత్తతే ప్రజలను కాపాడుతోంది.
News18 Telugu | December 4, 2020, 10:20 AM IST
1/ 7
మీరు బయటకు వెళ్లేటప్పుడు కరోనా మాస్క్ పెట్టుకుంటున్నారా, హ్యాండ్ శానిటైజర్ రాసుకుంటున్నారా... తప్పక వాడండి. కరోనా కేసులు తగ్గాయి కదా అని తేలిగ్గా తీసుకోకండి. మనకు కరోనా రాదనే నమ్మకం మనకు ఉండొచ్చు... కానీ... మన వల్ల ఇతరులకు కూడా అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది అని మరీ మరీ చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇంతలా ఎందుకు చెబుతోందంటే... విదేశాల్లో ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో కరోనా మూడు రెట్లు పెరిగిపోయింది. అక్కడ మరణాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఆ పరిస్థితి ఇండియాలో రాకూడదని కేంద్రం కోరుకుంటోంది. (image credit - NIAID)
2/ 7
ఇండియాలో నిన్న 36,595 కొత్త కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 95,71,559కి చేరింది. నిన్న కొత్తగా 540 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,39,188కి చేరింది. ఇండియాలో మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో అది 2.31 శాతంగా ఉంది. (image credit - twitter)
3/ 7
ఇండియాలో నిన్న 42,916 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 90,16,289కి చేరింది. ఇండియాలో రికవరీ రేటు 94.2 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,16,082గా ఉన్నాయి. ఇండియాలో నిన్న 11,70,102 టెస్టులు జరిగాయి. మొత్తం టెస్టుల సంఖ్య 14,47,27,749కి చేరింది. (image credit - twitter)
4/ 7
ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6.9వేల దాకా తగ్గాయి. వరుసగా ఏడ్రోజులుగా యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి. కొత్త కేసులు వరుసగా ఐదు రోజులుగా 40వేల కంటే తక్కువగా ఉన్నాయి. అలాగే... మరణాలు వరుసగా మూడ్రోజులుగా 500 కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక రికవరీలు ఇండియాలోనే ఉన్నాయి. కేరళలో కొత్త కేసులు 5.4వేలు రాగా... మహారాష్ట్రలో 5.2 వేలు, ఢిల్లీలో 3.7 వేలు, బెంగాల్లో 3.2 వేల కొత్త కేసులొచ్చాయి. మహారాష్ట్రలో నిన్న 115 మంది చనిపోగా... ఢిల్లీలో 82, బెంగాల్లో 49 మంది చనిపోయారు. ప్రపంచ దేశాల్లో నిన్న 12.7 వేల మరణాలు సంభవించాయి. ఇంత ఎక్కువ రావడం ఇదే తొలిసారి. నిన్న ప్రపంచవ్యాప్తంగా 6.79 లక్షల కొత్త కేసులొచ్చాయి. అమెరికాలో నిన్న 2.19 లక్షల కేసులొచ్చాయి. మరణాలు 2.9వేలు వచ్చాయి. (image credit - twitter - reuters)
5/ 7
ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్లో కొనసాగుతోంది. ఇండియా, బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా తర్వాత బ్రెజిల్ రెండోస్థానంలో ఉంది. టర్కీ, ఇండియా, రష్యా తర్వాత ఉన్నాయి. కరోనా మొత్తం మరణాల్లో అమెరికా టాప్లో ఉండగా... బ్రెజిల్, ఇండియా, మెక్సికో, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రోజువారీ మరణాల్లో అమెరికా (2918) టాప్లో ఉండగా... బ్రెజిల్ (776), ఇండియా, మెక్సికో (800), బ్రిటన్ (414) తర్వాతి పొజిషన్లలో ఉన్నాయి. (credit - twitter - reuters)
6/ 7
ఇండియాలో కరోనా కేసుల వివరాలు
7/ 7
ప్రపంచ దేశాల్లో కరోనా కేసుల వివరాలు