HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
CORONAVIRUS UPDATES INDIA COVID 19 NEW CASES RECORD 45148 WITH 480 NEW DEATHS IN 24 HOURS NK
India Covid 19: గుడ్ న్యూస్. ఇండియాలో మళ్లీ 50వేల కంటే తక్కువగా నమోదైన కరోనా కొత్త కేసులు
Coronavirus updates: ప్రపంచ దేశాలతో పోల్చితే... కరోనాను అత్యంత బాగా కంట్రోల్ చేస్తున్న దేశాల్లో ఇండియా మొదటిస్థానంలో ఉంది. అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాలు కంట్రోల్ చేయలేక చేతులెత్తేస్తున్నాయి.
News18 Telugu | October 26, 2020, 9:37 AM IST
1/ 6
ఇండియాలో కరోనా రోజురోజుకూ అదుపులోకి వస్తోంది. తాజాగా 24 గంటల్లో కొత్తగా... 45,148 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. కొత్త కేసులు మళ్లీ 50వేలకు దిగువన రావడం మంచి పరిణామం. మొత్తం కేసుల సంఖ్య 79,09,959కి చేరింది. అలాగే... నిన్న కరోనాతో... 480 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1,19,014కి చేరింది. ఇండియాలో మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో అది 2.7 శాతంగా ఉంది. (credit - NIAID)
2/ 6
ఇండియాలో నిన్న 59,105 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఫలితంగా మొత్తం రికవరీల సంఖ్య 71.37,228కి చేరింది. దేశంలో రికవరీ రేటు మరింత పెరిగి 90.23 శాతానికి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,53,717 ఉన్నాయి. మొన్నటికీ, నిన్నటికీ యాక్టివ్ కేసులు 14,437 తగ్గాయి. ఇండియాలో నిన్న 9,39,309 టెస్టులు చేశారు. మొన్నటి కంటే నిన్న 2,01,596 టెస్టులు తక్కువగా చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 10,34,62,778కి చేరింది.
3/ 6
రాష్ట్రాలవారీగా చూస్తే... ప్రస్తుతం మహారాష్ట్ర (299), ఢిల్లీ (277), బెంగాల్ (210) హర్యానా (147), నాగాల్యాండ్ (54), మిజోరం (41), మేఘాలయ (31), అండమాన్ నికోబార్ దీవులు (5), దాద్రానగర్ హవేలీ (1), మణిపూర్ (1), రాష్ట్రాల్లో మాత్రమే కొత్త కేసులు వస్తున్నాయి. మిగతా 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు తగ్గుతున్నాయి.
4/ 6
ప్రస్తుతం మొత్తం కేసుల్లో అమెరికా టాప్లో కొనసాగుతోంది. ఆ తర్వాత ఫ్రాన్స్ రెండోస్థానాన్ని చేరింది. భారత్ మూడోస్థానానికి పడిపోయింది. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా మొదటి స్థానంలో కొనసాగుతుంటే... ఆ తర్వాత ఫ్రాన్స్ వచ్చింది. ఇండియా మూడో స్థానానికి చేరింది. మొత్తం మరణాల్లో అమెరికా టాప్లో ఉండగా... బ్రెజిల్ (157,163), ఇండియా, మెక్సికో (88,743), బ్రిటన్ (44,896), ఇటలీ (37,128) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రోజువారీ మరణాల్లో ఇండియా టాప్లో ఉంది. ఆ తర్వాత అమెరికా, మెక్సికో (431), ఇరాన్ (296), అర్జెంటినా (283) ఉన్నాయి.
5/ 6
దేశంలో కరోనా కేసుల వివరాలు
6/ 6
ప్రపంచ దేశాల్లో కరోనా కేసుల వివరాలు