HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
CORONAVIRUS UPDATES INDIA COVID 19 NEW CASES 43893 AND 508 NEW DEATHS RECORD IN 24 HOURS NK
India Covid 19: భారత్లో 80 లక్షలకు చేరువలో కరోనా కేసులు... కొత్తగా ఎన్నంటే
Coronavirus updates: మొన్నటితో పోల్చితే... నిన్న ఇండియాలో కరోనా కేసులు పెరిగాయి. కారణం... టెస్టుల సంఖ్య పెరగడమే. మొత్తంగా చూస్తే... కరోనా జోరు కొంత తగ్గింది.
News18 Telugu | October 28, 2020, 10:07 AM IST
1/ 6
ఇండియాలో రోజువారీ కొత్త కరోనా కేసులు తగ్గుతున్నా... కరోనా కంట్రోల్లోకి వచ్చిందా అంటే... అప్పుడే అవును అని చెప్పేలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో కొత్త కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అవి మళ్లీ కొత్త భయాలు సృష్టిస్తున్నాయి. ఇండియాలో నిన్న కొత్తగా 43,893 కరోనా కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 79,90,322కి చేరింది. నిన్న కరోనాతో 508 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1,20,010కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. చాలా కాలంగా ఈ రేటు తగ్గట్లేదు. ప్రపంచ దేశాల్లో ఇది 2.65 ఉంది. (credit - NIAID)
2/ 6
నిన్న దేశంలో 58,439 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 72,59,509గా ఉంది. దేశంలో రికవరీ రేటు 90.9 శాతంగా ఉంది. ఇదో మంచి పరిణామం. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,10,803 ఉన్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 10,66,786 టెస్టులు జరిగాయి. మొన్నటి కంటే ఇవి 108670 ఎక్కువగా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకూ 10,54,87,680 టెస్టులు జరిగాయి.
3/ 6
ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 4.1 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 24 గంటల్లో... 15,054 తగ్గాయి. 26 రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు తగ్గుతూ ఉంటే... 9 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. అవి... తెలంగాణ (26), సిక్కిం (17), నాగాలాండ్ (27), మిజోరం (59), మణిపూర్ (23), హిమాచల్ ప్రదేశ్ (10), హర్యానా (298), ఢిల్లీ (2087), ఛండీగఢ్ (17). ఈ రాష్ట్రాల్లో కూడా కరోనా తగ్గితే... అప్పుడు మనం ఒకింత ఊపిరి పీల్చుకోవచ్చు.
4/ 6
ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్లో కొనసాగుతోంది. ఆ తర్వాత ఇండియా రెండోస్థానంలో ఉంది. బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా, ఇండియా, ఫ్రాన్స్, బ్రెజిల్, బ్రిటన్ టాప్ 5లో ఉన్నాయి. మొత్తం మరణాల్లో అమెరికా టాప్లో ఉండగా... బ్రెజిల్ (157,981), ఇండియా తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రోజువారీ మరణాల్లో అమెరికా టాప్లో ఉంది. ఆ తర్వాత బ్రెజిల్, ఫ్రాన్స్, ఇండియా, అర్జెంటినా ఉన్నాయి. (credit - twitter - reuters)
5/ 6
ఇండియాలో కరోనా కేసుల వివరాలు
6/ 6
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు