HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
CORONAVIRUS UPDATES HOW MUCH DANGEROUS NEW COVID VIRUS AND HOW IT MUTATED FROM PRESENT CORONAVIRUS NK
New Coronavirus: కొత్త కరోనా వైరస్‌తో ప్రమాదమే... ఇండియాలోకీ వస్తుందా?
New Coronavirus: చాలా దారుణమైన విషయం ఇది. కొత్త సంవత్సరంతో కరోనాకి గుడ్ బై చెప్పాలని ప్రపంచం కోరుకుంటే... ఈ కొత్త కరోనా తయారవుతోంది. మరి దీన్ని వదిలించడం ఎలా?
News18 Telugu | December 22, 2020, 9:53 AM IST
1/ 6
New Coronavirus: ప్రస్తుతం ఉన్న కరోనాను వదిలించుకోవడానికి ఇంకా ఎన్ని నెలలు పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో... బ్రిటన్, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇటలీ దేశాల్లో వ్యాపించి... మరిన్ని దేశాలకు విస్తరిస్తున్న కొత్త కరోనా మరో పెను సవాలు విసరబోతోంది. అది అంత డేంజరా అంటే... అవును అన్నదే సమాధానం. ఎందుకంటే... ఇప్పుడు ఉన్న కరోనా వ్యాపించే R వాల్యూ 1 ఉండగా... ఈ కొత్త కరోనా R వాల్యూ 1.5 అంటున్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా కంటే... కొత్త కరోనా 60 నుంచి 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాపిస్తోందని అంటున్నారు. ఎక్కువగా వ్యాపించినంత మాత్రాన... ఎక్కువ మరణాలు సంభవిస్తాయా అన్న ప్రశ్నకు మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కచ్చితమైన ఆధారాలు లేవు అని చెప్పింది. ఈ కొత్త కరోనా వైరస్‌ని అర్థం చేసుకునేందకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి ఈ కొత్త వైరస్ మరో సవాలే అనుకోవచ్చు. (image credit - NIAID)
2/ 6
మ్యూటేషన్ (Mutation) అంటే: మనం ఎండాకాలం రెయిన్ కోట్ ధరించం. చలికాలం తప్పనిసరిగా చలికోటు ధరిస్తాం... ఇలా కాలానికి తగ్గట్టు మనల్ని మనం సెట్ చేసుకుంటాం కదా... వైరస్లు కూడా అంతే... ఆయా కాలాలు, అక్కడి వాతావరణాలకు తగ్గట్టుగా తమను తాము మార్చుకుంటాయి. వైరస్ అనేది అతి చిన్నది కాబట్టి... రూపం మార్చుకోవడం దానికి పెద్ద విషయమేమీ కాదు. కరోనా కొత్త వైరస్‌లో వచ్చిన మార్పును ‘N501Y’ అని పిలుస్తున్నారు. కరోనా కొత్త వైరస్ బ్రిటన్‌లో సెప్టెంబర్‌లో మొదలైంది. ఇప్పటికే ఉన్న వైరస్‌కి చుట్టూ ముళ్లలాంటి కొవ్వు పదార్థం ఉంది కదా... కొత్త వైరస్‌లో ఆ ముళ్లు కొంచెం పెద్దగా, కాస్త బలంగా ఉన్నాయట. అంటే ఆ ముళ్లతో అది మరింత తేలిగ్గా శరీరంలోని కణాన్ని నాశనం చేసి... అందులోకి వెళ్లగలుగుతోంది. అందుకే ఈ కొత్త వైరస్ వేగంగా వ్యాపించగలుగుతోంది. (image credit - NIAID)
3/ 6
ఒంటరైన బ్రిటన్: ఈ కొత్త వైరస్ బ్రిటన్‌లోని 60 శాతం కరోనా కేసుల్లో ఉండటంతో... ఆ దేశాన్ని చూసి భారత్ సహా ప్రపంచ దేశాలు హడలెత్తుతున్నాయి. అక్కడికి విమాన సర్వీసులను ఆపేశాయి. భారత్ రెండు దేశాల మధ్యా విమాన సర్వీసులన్నింటినీ బుధవారం నుంచి ఈ నెల 31 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం రాత్రి వరకు మాత్రం సర్వీసులు కొనసాగుతాయని తెలిపింది. మంగళవారం రాత్రి వరకు బ్రిటన్ నుంచి భారత్‌కి వచ్చే వారు ఎయిర్‌పోర్టుల్లో RT-PCR టెస్ట్ చేయించుకోవాలని తెలిపింది. ఐతే సరకు రవాణా విమానాలు మాత్రం నడుస్తాయి. ఫలితంగా క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలకు బ్రిటన్ నుంచి స్వదేశాలకు వెళ్లాలనుకున్నవారికి ఛాన్స్ లేనట్లే. చాలా మంది భారతీయులు కూడా బ్రిటన్‌లో ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్నటి లాగే ఇవాళ కూడా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. (image credit - NIAID)
4/ 6
బ్రిటన్‌తో విమాన సర్వీసులపై నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీ ఇప్పటికే ఆంక్షలు ప్రకటించగా.. ఫ్రాన్స్, కెనడా, టర్కీ, డెన్మార్క్, హాంకాంగ్, ఇజ్రాయెల్, ఆస్ట్రియా, ఐర్లాండ్, ఇరాన్, క్రొయేషియా, అర్జెంటీనా, చిలీ, మొరాకో, కువైట్ కూడా తాజాగా ఆంక్షలు విధించాయి. బ్రిటన్‌తో ఫ్రాన్స్ సరిహద్దులను మూసేసింది. ఇటలీలో ఓ కొత్త కరోనా కేసు తాజాగా బయటపడింది. (image credit - NIAID)
5/ 6
కొత్త రకం కరోనా దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి వచ్చే నెల 5 వరకు రాష్ట్రంలోని పురపాలక సంఘాల ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. యూరప్, పశ్చిమాసియా దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు ఆసుపత్రులు, హోటళ్లలో 14 రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరి చేసింది. (image credit - NIAID)
6/ 6
వ్యాక్సిన్లు పనిచేసే అవకాశం: ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్లు ఈ కొత్త వైరస్ పైనా పనిచేయగలవని ఎక్కువ మంది పరిశోధకులు భావిస్తున్నారు. ఎందుకంటే... వ్యాక్సిన్లు తయారుచేసినప్పుడే... ఇలాంటి అంశాల్ని దృష్టిలో పెట్టుకొని తయారుచేస్తారనీ... పైగా... ఈ కొత్త వైరస్ ఆల్రెడీ ఉన్న వైరస్ నుంచే మారింది కాబ్టటి... ఇది కూడా వ్యాక్సిన్ల వల్ల చనిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఐతే... ఇది ఎంతవరకూ పనిచేస్తుందో పరీక్షలు జరిపితే కానీ చెప్పలేమని అంటున్నారు. (image credit - NIAID)