HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
CORONAVIRUS UPDATES FIRST CONSIGNMENT OF COVID 19 VACCINE COVISHIELD DESPATCHED FROM SERUM INSTITUTE IN PUNE NK
Covishield vaccine: చరిత్రాత్మక ఘట్టం. పుణె నుంచి బయల్దేరిన కరోనా వ్యాక్సిన్లు
Coronavirus updates: భారతదేశ చరిత్రలో ఈ రోజుకి ఓ ప్రత్యేకత ఉంది. కరోనా వైరస్‌కి తొలి వ్యాక్సిన్లు ఇవాళ రాష్ట్రాలకు వెళ్తున్నాయి.
News18 Telugu | January 12, 2021, 5:56 AM IST
1/ 7
భారతీయులంతా గర్వించదగ్గ రోజు ఇది. ఎందుకంటే... కరోనా వైరస్‌పై పోరాటంలో విజయం దిశగా దూసుకెళ్తూ ఇండియా... మరో ప్రధానమైన అడుగు వేసింది. ఇండియా కూడా ప్రపంచ దేశాలకు దీటుగా, సొంతంగా పవర్ఫుల్ వ్యాక్సిన్లు సృష్టించగలదని నిరూపించిన రోజు ఈ రోజు. పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫార్మా కంపెనీ నుంచి తొలి వ్యాక్సిన్లు... రాష్ట్రాలకు బయల్దేరాయి. రెండు ఫ్రీజర్ ట్రక్కులలో ఈ వ్యా్క్సిన్లు బయలుదేరిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ ట్రక్కులలో వ్యాక్సిన్లను విమానాల్లో ఎక్కించి... అక్కడి నుంచి అన్ని రాష్ట్రాలకూ తరలిస్తారు. రాష్ట్రాల్లోని ప్రధాన ఫ్రీజర్ కేంద్రాల్లో వాటిని ఉంచుతారు. అక్కడి నుంచి జిల్లాల్లోని ఫ్రీజర్ కేంద్రాలకు తరలిస్తారు. ముందుగా 1.10 కోట్ల డోసుల కోవిషీల్డ్ (covishield) వ్యాక్సిన్‌కు ఆర్డర్ వచ్చినట్లు సీరం తెలిపింది.
2/ 7
ఇండియాలో ఈ నెల 16న వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలవ్వనుంది. తొలి విడతగా 3 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు. ఇందుకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తొలి విడత వ్యాక్సిన్లను కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కి ఇస్తారు. అంటే డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లకు ఇస్తారు. రెండో విడత వ్యాక్సిన్లను ముసలివారికి ఇస్తారు. నిన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని మోదీ... మరో 4 వ్యాక్సిన్లు రెడీ అవుతున్నాయనీ, వాటికీ ఆమోదించే రోజు వస్తుందని తెలిపారు. వ్యాక్సిన్ల కోసం మనం తొందరపడాల్సిన పనిలేదనే సంకేతం ఇచ్చారు. టీకా వేయించుకున్న వారికి డిజిటల్ సర్టిఫికెట్ ఇస్తారు.
3/ 7
నిన్న ప్రపంచదేశాల్లో 4,59,871 కొత్త కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 9.11 కోట్లు దాటింది. నిన్న 7407 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 19.50 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2.41 కోట్లకు పైగా ఉన్నాయి. అమెరికాలో నిన్న 1.37 లక్షల కేసులొచ్చాయి. మొత్తం కేసులు 2.30 కోట్లు దాటాయి. నిన్న 1119 మంది చనిపోవడంతో... మొత్తం మరణాలు 3.84 లక్షలు దాటాయి.
4/ 7
ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్‌లో కొనసాగుతోంది. ఇండియా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా తర్వాత బ్రిటన్ (46,169) రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత బ్రెజిల్, స్పెయిన్, రష్యా ఉన్నాయి. మొత్తం కరోనా మరణాల్లో అమెరికా టాప్‌లో ఉండగా... బ్రెజిల్, ఇండియా, మెక్సికో, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రోజువారీ మరణాల్లో అమెరికా (1119) టాప్‌లో ఉండగా... జర్మనీ (663), బ్రిటన్ (529), మెక్సికో (502), ఇటలీ (448) తర్వాతి పొజిషన్లలో ఉన్నాయి. ఇండియా టాప్ 12కి పడిపోయింది.
5/ 7
ఇండియాలో కరోనా కేసులు మరింత తగ్గాయి. తాజాగా 16,311 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1.04 కోట్లు దాటింది. కొత్తగా 161 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1.51 లక్షలు దాటింది. దేశంలో మరణాల రేటు 1.4 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 16,959 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య కోటి దాటి కోటి 92వేల 909కి చేరింది. దేశంలో రికవరీ రేటు 96.4 శాతంగా ఉంది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసులు 2,22,526 ఉన్నాయి. కొత్తగా 6,59,209 టెస్టులు జరిగాయి. మొత్తం టెస్టుల సంఖ్య 18.17కోట్లను దాటింది.
6/ 7
తెలంగాణలో కొత్తగా 224 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 290,008కి చేరింది. ఒకరు చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1566కి చేరింది. కొత్తగా 461 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 283,924కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4518 ఉన్నాయి. వీటిలో 2439 మంది ఇళ్లలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. తెలంగాణలో మరణాల రేటు 0.54 శాతం ఉండగా... దేశంలో అది 1.4 శాతం ఉంది. తెలంగాణలో రికవరీ రేటు 97.90 శాతం ఉండగా... దేశంలో అది 96.4 శాతం ఉంది. తెలంగాణలో కొత్తగా 24785 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 72,78,021కి చేరింది.
7/ 7
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 121 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 8,85,037కి చేరాయి. కొత్తగా ఇద్దరు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 7,131కి చేరింది. కొత్తగా 213 మంది కరోనా నుంచి కోలుకొన్నారు. మొత్తం రికవరీల సంఖ్య 8,75,456కి చేరింది. రాష్ట్రంలో 2,450 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 30,933 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 1,23,55,607కి చేరింది.