ఇండియాలో నిన్న 9,70,133 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 9కోట్ల 42లక్షల 24 వేల 190కి చేరింది. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాల్యాండ్, ఉత్తరాఖండ్, బెంగాల్ రాష్ట్రాల్లో మాత్రమే కరోనా కేసులు పెరుగుతున్నాయి. మిగతా 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఇది చాలా మంచి పరిణామం. ప్రపంచ దేశాలతో పోల్చితే... కరోనాను కంట్రోల్ చెయ్యడంలో ఇండియా మెరుగైన ప్రదర్శన ఇస్తోంది.