Corona Cases : ఇండియాని కరోనా వదల్లేదు. 97 రోజుల తర్వాత మళ్లీ కొత్తగా 300కి పైగా పాజిటివ్ కేసులు నమోదవ్వడం ఒక్కసారిగా కలకలం రేపింది. సాధారణంగా ఎండాకాలం వచ్చినప్పుడు కొత్త కేసులు తగ్గుతాయి. వేడి వాతావరణంలో వైరస్ వ్యాప్తి పెద్దగా ఉండదు. కానీ.. సమ్మర్ వస్తున్న సమయంలో కొత్త కేసులు పెరగడం ఆలోచించాల్సిన విషయం అయ్యింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇప్పటివరకూ ఇండియాలో 4.41 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు ప్రస్తుతం 1 శాతం కూడా లేవు. కనీసం 0.00 శాతం కూడా లేవు. అంటే ఇండియాలో కరోనా చాలా చాలా తక్కువగా ఉన్నట్లు లెక్క. అంతేకాదు.. రికవరీ రేటు 98.80 శాతంగా ఉన్నట్లు స్వయంగా కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్సైట్ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)