Covid 19 Updates: ఇండియాలో కొత్తగా 53,256 కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,99,35,221కి చేరింది. కొత్తగా 1,422 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 3,88,135కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచదేశాల్లో ఇది 2.17 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 78,190 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,88,44,199కి చేరింది. రికవరీ రేటు కొద్దిగా పెరిగి 96.4 శాతానికి చేరింది. ప్రస్తుతం భారత్లో 7,02,887 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 13,88,898 టెస్టులు చేశారు. భారత్లో ఇప్పటివరకు 39 కోట్ల 24 లక్షల 07 వేల 782 టెస్టులు చేశారు. కొత్తగా 30,39,996 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 28 కోట్ల 36 వేల 898 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. (image credit - NIAID)
24 గంటల్లో 26,356 యాక్టివ్ కేసులు తగ్గాయి. అలాగే కొత్త కేసులు 88 రోజుల కనిష్టానికి పడిపోయాయి. రికవరీలు వరుసగా 39వ రోజు కొత్త కేసుల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. రికవరీ రేటు కూడా కాస్త పెరిగి 96.36 శాతానికి చేరింది. అలాగే... వీక్లీ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంటూ... ప్రస్తుతం 3.32 శాతం ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.83 శాతం ఉంది. ఇది వరుసగా 14వ రోజు 5 శాతం కంటే తక్కువే ఉంది. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా కొత్త కేసులు కేరళలో వచ్చాయి. అక్కడ కొత్తగా 11,647 రాగా... ఆ తర్వాత మహారాష్ట్రలో 9,361 కేసులు, తమిళనాడులో 7,817 కేసులు వచ్చాయి. ప్రస్తుతం దేశంలో 10వేల కంటే ఎక్కువ కేసులు నమోదైన రాష్ట్రంగా కేరళ మాత్రమే ఉంది. అలాగే... దేశంలో నిన్న 5వేల కంటే ఎక్కువ కేసులు నమోదైన రాష్ట్రాల సంఖ్య 4 మాత్రమే ఉంది. (image credit - twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 1,006 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,13,202కి చేరాయి. కొత్తగా 1,798 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 5,91,870కి చేరింది. రికవరీ రేటు 96.52 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా 11 మంది మరణించారు. మొత్తం మరణాలు 3,567కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,765 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
AP Covid: ఆంధ్రప్రదేశ్లో తాజాగా 1,00,001 టెస్టులు చెయ్యగా... కొత్తగా 5,646 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 18,50,563కి చేరింది. కొత్తగా 50 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 12,319కి చేరింది. కొత్తగా 7,772 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 17,75,176కి చేరింది. ప్రస్తుతం 63,068 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,11,50,847 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 2,89,502 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 17.92 కోట్లు దాటింది. కొత్తగా 5,788 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 38.81 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.15 కోట్లు ఉన్నాయి. అమెరికాలో కొత్తగా 4,354 కేసులు, 86 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో 44,178 కొత్త కేసులు... 957 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రోజువారీ ఎక్కువ కేసులు బ్రెజిల్ లేదా ఇండియాలో వస్తుంటే... ఆ తర్వాత కొలంబియా, రష్యా, ఇండొనేసియా ఉన్నాయి. రోజువారీ మరణాల్లో బ్రెజిల్ లేదా ఇండియా మొదటి స్థానంలో ఉంటుంటే... ఆ తర్వాత కొలంబియా, రష్యా, ఇండొనేసియా ఉన్నాయి. (image credit - twitter - reuters)