Delta Plus: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ తగ్గినట్లు కనిపిస్తున్నా... నిజానికి అది తగ్గనట్లే అంటున్నారు. ఎందుకంటే... ప్రమాదకరమైన డెల్టా వేరియంట్లో కొన్ని మార్పులు వచ్చాయి. ఆ మ్యూటేషన్లతో కొత్తగా డెల్టా ప్లస్ వేరియంట్ తయారైంది. అది ఇప్పటికే... మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌లో వ్యాపించింది. 22 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ప్రకటించారు. ఇండియాలోనే కాదు అమెరికా, బ్రిటన్, పోర్చుగల్, జపాన్, స్విట్జర్లాండ్, పోలాండ్, నేపాల్, చైనా, రష్యాలో కూడా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు ఉన్నాయి. యూరప్‌లో మార్చిలో ఈ వేరియంట్ వచ్చింది. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌లో టెస్టింగ్, ట్రేసింగ్, వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ఇది థర్డ్ వేవ్‌కి దారితీస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి. (image credit - twitter)
తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ కాలంలో సీజ్ చేసిన వాహనాల్ని రిలీజ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా వాహనాల్ని సీజ్ చేశారు. వాటి వాహనదారులు... ఇప్పుడు చలాన్లు చెల్లించి వాటిని తీసుకెళ్లవచ్చు. ఇందుకు కూడా కరోనా రూల్స్ పాటించాలి. పాటించకపోతే రూ.1000 ఫైన్ వేస్తారు. వాహనాన్ని ఏ పోలీస్ స్టేషన్ లో సీజ్ చేశారో... అక్కడి నుంచి వాహనదారులకు మొబైల్ మెసేజ్ వస్తుంది. అందులో ఎంత ఫైన్ చెల్లించాలో చెబుతారు. దాన్ని టీ-యాప్, టీ-వ్యాలెట్, ఈ-సేవ, మీ-సేవ, పేటీఎం, టీఎస్ ఆన్లైన్ లేదా పోలీస్ వెబ్సైటులో చెల్లించాలి. ఆ తర్వాత చెల్లింపు వివరాల రిసీట్ ప్రింట్ తీసుకొని... పోలీస్ స్టేషన్‌కి వెళ్లి... చూపిస్తే... వాహనం ఇస్తారు. (image credit - twitter)
హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ తయారుచేస్తున్న కోవాగ్జిన్... మూడో దశ ట్రయల్స్ ఫలితాలు వచ్చాయి. ఈ వ్యాక్సిన్ 77.8 శాతం సామర్ధ్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. జనరల్‌గా ఏ వ్యాక్సిన్ అయినా... 70 శాతం సామర్ధ్యం కలిగి ఉండాలి. మూడో దశలో 25,800 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. ఫలితాల రిపోర్టును భారత మందుల నియంత్రణ సంస్థ (DCGI)కి ఇచ్చింది. ఈ వ్యాక్సిన్‌కి జనవరిలోనే ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి లభించింది. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా దీన్ని ఆమోదించే ఛాన్స్ ఉంది. (image credit - Twitter - reuters)
Covid 19 Updates: ఇండియాలో కొత్తగా 42,640 కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,99,77,961కి చేరింది. కొత్తగా 1,167 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 3,89,302కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచదేశాల్లో ఇది 2.17 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 81,839 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,89,26,038కి చేరింది. రికవరీ రేటు కొద్దిగా పెరిగి 96.5 శాతానికి చేరింది. ప్రస్తుతం భారత్‌లో 6,62,521 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 16,64,360 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 39 కోట్ల 40 లక్షల 72 వేల 142 టెస్టులు చేశారు. కొత్తగా 86,16,373 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 28 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. (image credit - twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 1,175 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,15,574కి చేరాయి. కొత్తగా 1,771 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 5,95,348కి చేరింది. రికవరీ రేటు 96.71 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా 10 మంది మరణించారు. మొత్తం మరణాలు 3,586కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,640 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
AP Covid: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 74,453 టెస్టులు చెయ్యగా... కొత్తగా 4,169 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 18,57,352కి చేరింది. కొత్తగా 53 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 12,416కి చేరింది. కొత్తగా 8,376 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 17,91,056కి చేరింది. ప్రస్తుతం 53,880 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,12,80,302 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 3,61,145 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 17.99 కోట్లు దాటింది. కొత్తగా 7,959 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 38.97 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.13 కోట్లు ఉన్నాయి. అమెరికాలో కొత్తగా 9,694 కేసులు, 325 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో 86,833 కొత్త కేసులు... 2,080 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రోజువారీ ఎక్కువ కేసులు బ్రెజిల్ లేదా ఇండియాలో వస్తుంటే... ఆ తర్వాత కొలంబియా, అర్జెంటినా, రష్యా ఉన్నాయి. రోజువారీ మరణాల్లో బ్రెజిల్ లేదా ఇండియా మొదటి స్థానంలో ఉంటుంటే... ఆ తర్వాత అర్జెంటినా, కొలంబియా, రష్యా ఉన్నాయి. (image credit - twitter - reuters)