Covid 19 Updates: కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు నిపుణులు ఏం చెప్పినా... జాగ్రత్తగా వింటాం. తీరా అది తగ్గిపోయాక... నిపుణులు చెప్పేది వినాలనే ఆసక్తి ఉండది. అది మనిషి నైజం. కానీ కరోనా థర్డ్‌వేవ్ కచ్చితంగా వస్తుందనీ... కాబట్టి... జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. సమస్యేంటంటే... కరోనా వైరస్ ఎలాంటిది అనేదానిపై ఇంకా పూర్తి అవగాహన రాలేదు. అందువల్ల అది సోకి, నయం అయిపోయినా... దీర్ఘ కాలంలో ఎలాంటి సమస్యలు వస్తాయన్నది ఇప్పుడే చెప్పలేమంటున్నారు. అంతేకాదు... రికవరీ అయిన వారు కూడా మళ్లీ కరోనా బారిన పడవచ్చంటున్నారు. అదీకాక డెల్టా ప్లస్ వేరియంట్ అనేది చాలా వేగంగా వ్యాపిస్తోంది. అది థర్డ్ వేవ్ వచ్చేందుకు కారణం అవుతుందేమో అని భావిస్తున్నారు. అందువల్ల అప్రమత్తంగా ఉండటమే సరైన పరిష్కారం అని సూచిస్తున్నారు. (image credit - twitter)
ఈ సంవత్సరం చివరి నాటికి ప్రపంచంలో 30 శాతం మందికి... వచ్చే సంవత్సం చివరి నాటికి 70 శాతం మందికి కరోనా వ్యాక్సిన్లు వేసేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కోరుతోంది. ఆ దిశగా ప్రపంచ దేశాలు అడుగులు వెయ్యాలి అంటోంది. ఐతే... 70 శాతం మందికి వ్యాక్సిన్లు వెయ్యాలంటే... 1100 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరం అని అంచనా. అన్ని కావాలంటే... ఉత్పత్తిని వేగవంతం చెయ్యాల్సి ఉంటుంది. అందువల్ల వ్యాక్సిన్ల పేటెంట్ హక్కుల నుంచి ప్రపంచ దేశాలకు మినహాయింపు ఇవ్వాలని WHO కోరుతోంది. (image credit - twitter)
ఇండియాలో కోవాగ్జిన్ వేసుకున్న వారికి విదేశాల్లో చిక్కులు ఎదురవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లిస్టులో కోవాగ్జిన్ ఇంకా చేరకపోవడం వల్ల... చాలా దేశాలు ఈ వ్యాక్సిన్ వేయించుకున్న భారతీయలను తమ దేశంలోకి అనుమతించట్లేదు. దాంతో... అక్కడిదాకా వెళ్లిన వారు తిరుగు ప్రయాణం కావాల్సి వస్తోంది. గల్ఫ్ దేశాల్లో ఈ సమస్య బాగా కనిపిస్తోంది. అలాగే ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల్లో తిరుగు ప్రయాణాలు తప్పట్లేదు. దీన్ని తయారుచేస్తున్న భారత్ బయోటెక్ మాత్రం 14 దేశాల్లో అనుమతి ఉందని చెబుతోంది. అమెరికాలోని FDA కూడా కోవాగ్జిన్‌కి అనుమతి ఇవ్వలేదు. మరింత డేటా ఇస్తే... దాన్ని పరిశీలించి మరోసారి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. దీంతో ఎన్నారైలకు విదేశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. (image credit - twitter)
Covid 19 Updates: ఇండియాలో కొత్తగా 58,419 కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,98,81,965కి చేరింది. కొత్తగా 1,576 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 3,86,713కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచదేశాల్లో ఇది 2.17 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 87,619 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,87,66,009కి చేరింది. రికవరీ రేటు కొద్దిగా పెరిగి 96.3 శాతానికి చేరింది. ప్రస్తుతం భారత్‌లో 7,29,243 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 18,11,446 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 39 కోట్ల 10 లక్షల 19 వేల 083 టెస్టులు చేశారు. కొత్తగా 38,10,554 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 27 కోట్ల 66 లక్షల 93 వేల 572 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. (image credit - twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 1,006 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,13,202కి చేరాయి. కొత్తగా 1,798 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 5,91,870కి చేరింది. రికవరీ రేటు 96.52 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా 11 మంది మరణించారు. మొత్తం మరణాలు 3,567కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,765 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
AP Covid: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 1,00,001 టెస్టులు చెయ్యగా... కొత్తగా 5,646 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 18,50,563కి చేరింది. కొత్తగా 50 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 12,319కి చేరింది. కొత్తగా 7,772 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 17,75,176కి చేరింది. ప్రస్తుతం 63,068 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,11,50,847 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 2,89,502 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 17.92 కోట్లు దాటింది. కొత్తగా 5,788 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 38.81 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.15 కోట్లు ఉన్నాయి. అమెరికాలో కొత్తగా 4,354 కేసులు, 86 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో 44,178 కొత్త కేసులు... 957 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రోజువారీ ఎక్కువ కేసులు బ్రెజిల్ లేదా ఇండియాలో వస్తుంటే... ఆ తర్వాత కొలంబియా, రష్యా, ఇండొనేసియా ఉన్నాయి. రోజువారీ మరణాల్లో బ్రెజిల్ లేదా ఇండియా మొదటి స్థానంలో ఉంటుంటే... ఆ తర్వాత కొలంబియా, రష్యా, ఇండొనేసియా ఉన్నాయి. (image credit - twitter - reuters)