కరోనా వైరస్ మహమ్మారి పెద్ద పెద్ద కంపెనీల మీదే కాదు. విజ్ఞాలను తొలగించే వినాయకుడి మీద కూడా పడింది. ముంబైలోని ప్రఖ్యాత సిద్ధివినాయక ఆలయానికి కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రూ.18 కోట్ల మేర ఆదాయం తగ్గిపోయింది.
2/ 6
ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో ఉన్న ఈ ఆలయానికి హుండీ, ఇతరత్రా ఆదాయ మార్గాలు కలిపి ఏడాదికి రూ.96 కోట్లు ఉంటుందని అంచనా. కరోనా కారణంగా మూడున్నర నెలల పాటు ఆలయంలో భక్తులకు దర్శనం లేదు. ఈ కారణంగా సుమారు రూ.18 కోట్ల ఆదాయం తగ్గినట్టు అంచనా.
3/ 6
సిద్ది వినాయక ఆలయానికి నెలకు హుండీల ద్వారా సుమారురూ.3కోట్లు, ప్రసాదాలు, అర్చనలు, ఇతర సేవా టికెట్ల ద్వారా మరో రూ.3కోట్ల ఆదాయం లభిస్తుంది. రెండూ కలిపి నెలకు రూ.6కోట్ల చొప్పున మూడు నెలల్లో రూ.18 కోట్ల ఆదాయం తగ్గిపోయింది.
4/ 6
జూన్ నెల ప్రారంభంలో 15 రోజులు ఆలయం తెరిచినా.. ఆ తర్వాత మళ్లీ వర్షాలు పడడంతో భక్తుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం ఆన్ లైన్ దర్శనం, హారతి ఉచిత సేవలు కొనసాగుతున్నాయి. పూజా కైంకర్యాలకు మాత్రం రుసుము చెల్లించాలి.
5/ 6
కరోనా కాలంలో ఆదాయం తగ్గినా కూడా ఆలయ అధికారులు పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైద్య సాయం అందిస్తున్నారు. (Image;ANI)
6/ 6
సిద్ది వినాయక ఆలయ ట్రస్టు హివారే గ్రామానికి రూ.5కోట్లు ఆర్థిక సాయం చేసింది. అలాగే, సీఎం రిలీఫ్ ఫండ్, ఇతర సామాజిక కార్యక్రమాలకు కూడా నిధులు అందజేసింది. (Image;ANI)