India Corona Bulletin: పండగల సమయంలో కరోనా వ్యాప్తి ఎక్కవగా ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ ఈసారి మాత్రం కోవిడ్ ప్రభావం అంతగా లేదు. కొత్త కేసులు పెరగకపోవడం ఊరటనిచ్చే విషయం
India Covid 19: గుడ్ న్యూస్. మనదేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 50వేలకు దిగువన పడిపోయింది. (image credit - NIAID)
2/ 8
మన దేశంలో శుక్రారం 5,554 కరోనా కేసులు నమోదయ్యాయి. 6,322 మంది కరోనా నుంచి కోలుకోగా.. 18 మరణాలు నమోదయ్యాయి. ఇందులో 2 బ్యాక్లాగ్ మరణాలున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
భారత్‌లో ఇప్పటి వరకు 4,44,90,282 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 4,39,13,294 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 5,28,139 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మన దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 48,850కి చేరింది. ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
శుక్రవారం 3,76,855 మందికి పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా .. వారిలో 5,554 మందికి పాజిటివ్‌గా తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.47 శాతంగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
ప్రస్తుతం ఒక్క కేరళలో మాత్రమే వెయ్యికి పైగా కేసులు వస్తున్నాయి. కేరళలో 1,154, మహారాష్ట్రలో 955, కర్నాటకలో 670 మంది కరోనా బారినపడ్డారు. మిగతా రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య 500 కన్నా తక్కువే నమోదవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
మిజోరాంలో కరోనా పాజిటివిటీ రేటు 11.86శాతంగా ఉంది. గోవాలో 9.75శాతం, మేఘాలయాలో 7.58 శాతం నమోదయింది. దేశవ్యాప్తంగా 118 జిల్లాల్లో డైలీ పాజిటివిటీ రేటు 5శాతాని కంటే ఎక్కువగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
తెలంగాణలో శుక్రవారం 128 కొత్త కేసులు నమోదయ్యాయి. 177 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 52 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 73 మంది కోవిడ్ నుంచి బయటపడ్డారు. ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
మన దేశంలో గత ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 214.77 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 21.63 లక్షల మందికి టీకాలను వేశారు. మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 88,90,87,642కి చేరింది. (ప్రతీకాత్మక చిత్రం)