Cooking Oil: పండగ వేళ సామాన్యులకు శుభవార్త.. వంటనూనెల ధరలను తగ్గించిన కేంద్రం

Edible Oil Prices: కొన్ని రోజులుగా వంట నూనెల ధరలు భగ్గుమంటున్నాయి. లీటర్ అయిల్ ప్యాకెట్ ధర గతలో 90-110 ఉంటే.. ఇప్పుడు ఏకంగా 150-160కి చేరింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీనికి తోడు ఆయిల్ ధరలు కూడా మండిపోవడంతో ప్రజలు గగ్గోలుపెడుతున్నారు. ఐతే నూనెల ధరలను తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.