Rahul Gandhi: అత్యంత ప్రాచీన శక్తిపీఠాన్ని సందర్శించిన రాహూల్ గాంధీ.. అస్సాంను రక్షించుకోవాలంటే..
Rahul Gandhi: అత్యంత ప్రాచీన శక్తిపీఠాన్ని సందర్శించిన రాహూల్ గాంధీ.. అస్సాంను రక్షించుకోవాలంటే..
కాంగ్రెస్ యువనేత రాహూల్ గాంధీ ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా కష్టపడుతున్నారు. కాంగ్రెస్ కు గణనీయంగా సీట్లు రాబట్టేలా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.
దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ కు చావో రేవో అన్నట్టుగా మారాయి.
2/ 6
దీంతో ఆ పార్టీ యువ నేత రాహూల్ గాంధీ తీవ్రంగా చెమటోడ్చుతున్నారు.
3/ 6
దీనిలో భాగంగానే బుధవారం అస్సాం రాష్ట్రంలోని కామాఖ్య దేవాలయాన్ని ఆయన సందర్శించారు.
4/ 6
దేశంలోని 51 శక్తిపీఠాల్లో అత్యంత ప్రాచీనమైన శక్తిపీఠంగా ఈ కామాఖ్య దేవాయాలయానికి గుర్తింపు ఉంది. అస్సాం రాష్ట్ర ప్రజల కోసం వేడుకున్నానని ఈ సందర్భంగా రాహూల్ గాంధీ వ్యాఖ్యానించారు.
5/ 6
దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించారు.
6/ 6
అస్సాంను రక్షించుకోవాలంటే కాంగ్రెస్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు.