ముంబై నార్త్ సెంట్రల్ స్థానానికి నామినేషన్ వేశారు ప్రియాదత్.
2/ 9
నామినేషన్‌కి ముందు ఆమె సిద్ధివినాయక ఆలయంలో పూజలు చేశారు.
3/ 9
ప్రస్తుతం ముంబై నార్త్ సెంట్రల్ పూనమ్ మహాజన్ వర్సెస్ ప్రియాదత్గా సాగుతోంది. ఇద్దరూ ప్రముఖ నేతల కూతుర్లు కావడంతో ఇద్దరికీ పోటా పోటీగా ఉంది.
4/ 9
బీజేపీ దివంగత నేతైన ప్రమోద్ మహాజన్ కూతురిగా పూనమ్ మహాజన్ మంచి పేరు తెచ్చుకున్నారు. 2014లో ప్రియాదత్‌ను ఓడించి సంచలనం సృష్టించారు. దాదాపు 2 లక్షల మెజారిటీతో ప్రియాదత్‌పై విజయం సాధించారు.
5/ 9
మరోసారి ప్రియాదత్‌పై పోటీ చేస్తున్న పూనం మహాజన్... మోదీ చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందంటున్నారు. ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని భావించిన ప్రియాదత్.... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒత్తిడితో అయిష్టంగానే ఎన్నికల బరిలో దిగారు.
6/ 9
ప్రియాదత్ తండ్రి సునీల్ దత్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్రంలో క్రీడల శాఖను నిర్వహించారు. శాంతియుత నేతగా ఆయనకు పేరుంది.
7/ 9
ముంబై నార్త్ సెంట్రల్ సినీస్టార్లు ఎక్కువగా ఉండే ప్రాంతం. అందరూ విద్యావంతులే కాబట్టి ఓటర్లను ఆకట్టుకోడం ఇక్కడ చాలా కష్టమైన పనిగా కనిపిస్తుంది.
8/ 9
సునీల్ దత్ మరణం తర్వాత 2005లో రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాదత్ శివసేన అభ్యర్థిపై భారీ మెజారిటీతో గెలిచారు. ఆలిండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా కూడా పనిచేశారు. గత ఎన్నికల్లో మోదీ వేవ్ వల్ల ఓడిపోయారు.
9/ 9
ఇద్దరికీ వ్యక్తిగతంగా మంచి పేరు, గుర్తింపు ఉండటంతో ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది.