Ugadi2023 | Chaitra Navratri: చైత్ర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం ..ఈ 9రోజులు ఉపవాసం చేస్తే కలిగే ఫలితం ఏంటో తెలుసా..?
Ugadi2023 | Chaitra Navratri: చైత్ర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం ..ఈ 9రోజులు ఉపవాసం చేస్తే కలిగే ఫలితం ఏంటో తెలుసా..?
Chaitra Navratri:ఉగాది పర్వదినం రోజు కావడంతో ఈరోజు నుంచి చైత్ర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల్లో ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు.
ఉగాది పర్వదినం రోజు కావడంతో ఈరోజు నుంచి చైత్ర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల్లో ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. (Photo:Twitter ANI)
2/ 10
చైత్రశుక్ల పాడ్యమి మార్చి 22వ తేది బుధవారం నుంచి 9రోజుల పాటు దుర్గాదేవికి పూజలు, రోజుకో రంగుతో అలంకారం చేస్తారు. అలాగే భక్తులు ఈ 9రోజుల పాటు ఉపవాస దీక్షలు కూడా చేస్తారు. విజయదశమికి అమ్మవారి నవరాత్రులు ఎలా నిర్వహిస్తారో..ఉగాదికి కూడా చైత్రనవరాత్రులు నిర్వహిస్తారు. (Photo:Twitter ANI)
3/ 10
చైత్య నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహరాష్ట్రలోని దుర్గాదేవి అమ్మవారి ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. థానె జిల్లాలోని శ్రీ అంబే మాత ఆలయంలో చైత్రనవరాత్రి ఉత్సవాల్లో సీఎం ఏక్నాథ్ షిండే పాల్గొన్నారు. (Photo:Twitter ANI)
4/ 10
ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారి శోభయాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి..మొక్కులు చెల్లించుకున్నారు ఏక్‌నాథ్‌షిండే. సీఎం పర్యటన నేపధ్యంలో అధికారులు గట్టి ఏర్పాట్ల చేశారు. (Photo:Twitter ANI)
5/ 10
అటు అసోంలో కూడా చైత్ర నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గౌహతిలోని కామాక్షి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రుల్లో తొలిరోజు కావడంతో ఆలయాన్ని పూలతో అలంకరించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. (Photo:Twitter ANI)
6/ 10
వేసవిలో వచ్చే చైత్ర నవరాత్రులలో కూడా, ప్రజలు దుర్గా మాత ను ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం ఉంటారు, కాబట్టి వారు పుష్కలంగా పండ్లు తినాలి. చిప్స్ లాంటివి తినవద్దు. ఉపవాస సమయంలో తప్పనిసరిగా పాలు తాగాలి. పండ్లు తినడం మరియు నీరు ఎక్కువగా తాగడం వంటివి చేయండి .(Photo:Twitter ANI)
7/ 10
జమ్మూకశ్మీర్‌లో కూడా చైత్ర నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు భక్తులు. కత్రాలోని వైష్ణోదేవి ఆలయంలో ఉదయం నుంచే భక్తులు బారులుతీరారు. ఉగాది పండుగతో పాటు దేవి నవరాత్రులు ప్రారంభమవుతున్న తొలి రోజు కావడంతో విశేష పూజలుచేశారు. (Photo:Twitter ANI)
8/ 10
నవరాత్రులలో స్త్రీలకు చాలా పనులు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, పూజలో నిమగ్నమై , ఆరోగ్యం పైన జాగ్రత్త మర్చిపోతువుంటాం . కానీ ఉపవాస సమయంలో ఆరోగ్యం పైన శ్రద్ధ అనేది ఇంకాస్త ఎక్కువగా ఉండాలి . (Photo:Twitter ANI)
9/ 10
కొన్ని గంటల వ్యవధిలో తినండి. వేసవిని దృష్టిలో ఉంచుకుని, పండ్లు, జ్యూస్‌లు, పెరుగు, షేక్స్ మరియు కొబ్బరి నీటిని ఎక్కువ పరిమాణంలో తీసుకుంటు ఉండాలి .మీరు కూడా ఆరోగ్యకరమైన వస్తువులను మాత్రమే తీసుకోవాలి.(Photo:Twitter ANI)
10/ 10
టీ-కాఫీ ఎక్కువగా తాగవద్దు. దాని వలన ఇబ్బందులు ఉంటాయి .తేలికైన ఆహారాన్ని తింటు మనసు నిండా భక్తి తో అమ్మవారిని వివిధ రకాల నైవేద్యాలతో 9 రోజులు భక్తి శ్రద్దలతో కొలవండి . ఇలా చేస్తే ఆరోగ్యంతో పాటు అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పొందగలరు .(Photo:Twitter ANI)