Chaitra Navratri 2023: చైత్ర నవరాత్రులు.. ఈ తొమ్మిది రోజులు దుర్గామాతను పూజిస్తే సకల శుభాలు..
Chaitra Navratri 2023: చైత్ర నవరాత్రులు.. ఈ తొమ్మిది రోజులు దుర్గామాతను పూజిస్తే సకల శుభాలు..
నవరాత్రి అనేది దేశంలో సంవత్సరానికి రెండుసార్లు జరుపుకునే హిందూ పండుగ. చైత్ర మాసంలో అంటే చైత్ర నవరాత్రి (మార్చి-ఏప్రిల్), శారద నవరాత్రి 2023 (అక్టోబర్-నవంబర్)లో వస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలో శుక్ల పక్షంలో లేదా.. పౌర్ణమి దశలో మాత్రమే చైత్ర నవరాత్రులను జరుపుకుంటూ ఉంటారు.
ప్రతి సంవత్సరం చైత్ర నవరాత్రులు ప్రతిపద తిథి నుంచి ప్రారంభమవుతాయి. చైత్ర మాస తిథి మార్చి 21వ తేదీ రాత్రి 10.52 గంటలకు ప్రారంభమై మార్చి 22వ తేదీ రాత్రి 8.20 గంటల వరకు ఉంటుంది.
2/ 8
ఉదయతిథి ప్రకారం మార్చి 22 నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. చైత్ర నవరాత్రి హిందూ నూతన సంవత్సరానికి నాందిగా పరిగణించబడుతుంది.
3/ 8
చైత్ర నవరాత్రులలో ప్రజలు దుర్గా మాతను పూజిస్తారు. ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి 9 రోజులు ఉపవాసం ఉంటారు. మరోవైపు, మొత్తం 9 రోజులు ఉపవాసం ఉండలేని వారు మొదటి రోజు, చివరి రోజు ఉపవాసం ఉంటారు.
4/ 8
నవరాత్రి ఉపవాస సమయంలో ఆహారం తీసుకోరు. ఈ సమయంలో పాలు, పెరుగు, పండ్లు మాత్రమే తీసుకుంటారు.
5/ 8
నవరాత్రులలో 9 రోజులు ప్రత్యేకమైనవి. ఈ 9 రోజులలో తొమ్మిది రకాల పూజలు ఉంటాయి. ప్రతి రూపానికి ఒక విశిష్టత ఉంటుంది. వాటి ఆరాధనా విధానం కూడా తదనుగుణంగా ఉంటుంది.
6/ 8
తొమ్మిది అవతారాలలో ఉన్న మాతను ప్రతి రోజు ఒక్కో అవతారంలో ఉన్న మాతను పూజిస్తూ ఉంటారు.
7/ 8
ఇలా చేయడం వల్ల వారి కుటుంబంలోని ఆనందం, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయని నమ్మకం.
8/ 8
మార్చి 22న సిట్రస్ కలిగిన ఆహారం తింటే మంచిదని పండితులు చెబుతున్నారు.