ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. దేశంలో పులుల మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా కేంద్రం రాజ్యసభలో వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
వృద్ధాప్యం సహా వివిధ కారణాలతో అంతకుముందు ఏడాది 106 మరణాలు సంభవించాయి. అయితే సంఖ్య గతేడాది 127కు పెరిగాయని ప్రభుత్వం వెల్లడించింది. 2019లో పులుల మరణాల సంఖ్య 96గా ఉందని తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
పులుల మరణానికి వృద్ధాప్యం, పులుల మధ్య గొడవలు, విద్యుదాఘాతం, వేట వంటి అనేక కారణాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్రాలు నివేదించిన ప్రకారం.. 2021లో పులుల మరణాల సంఖ్య 127గా ఉందని ఆయన తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
గత సంవత్సరం గరిష్టంగా మధ్యప్రదేశ్లో పులుల 42 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 27, కర్ణాటకలో 15, ఉత్తరప్రదేశ్లో 9 మరణాలు నమోదయ్యాయి.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
జంతు-మానవ సంఘర్షణల నిర్వహణకు ప్రభుత్వం కృషి చేస్తోందని.. వేటపై కఠిన చర్యలు తీసుకుంటోందని కేంద్రమంత్రి తెలిపారు. భారతదేశం అతిపెద్ద పులులు కలిగి ఉన్న దేశం. ప్రపంచ పులుల జనాభాలో 75 శాతానికి పైగా భారత్లోనే ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)